రోడ్ల దుస్థితిపై గళమెత్తిన వడ్డిపిల్లి శ్రీనువాసరావు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మరియు జి.సిగడాం మండలం గంగన్నధోరపాలేం గ్రామం నుండి దేవరవలస గ్రామం వరకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉంది. బుధవారం కోత్తకుంకాం పంచాయతీ జనసేన పార్టీ యంపిటిసి అభ్యర్థి వడ్డిపిల్లి శ్రీనువాసరావు రోడ్లు పరిస్థితి చూసి ప్రజలు ప్రయాణించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పైఅధికారులకు వినతిపత్రం కూడ ఇవ్వడం జరిగింది. వైసీపి ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఆ రహధారి గుండా చుట్టూ ప్రక్కల 30గ్రామాలు అదే రహదారిపై ప్రజలు ప్రయాణించడం జరుగుతుంది. ఆ రహధారి గుండా గర్భిణీ స్త్రీలు అక్కడిక్కడే డెలివరీ అయ్యే పరిస్థితి జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆరోడ్లును నిర్మాణంపూర్తి చేయాలని జనసేన పార్టీ తరుపున శ్రీనువాసరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మేము పోరాటానికైన సిద్ధంగా ఉంటామని శ్రీనువాసరావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు రాష్ట్ర స్థాయి కార్యదర్శి కాకర్ల సన్యాసిరావు, గోవిందపురం పంచాయతీ జనసేన పార్టీ యంపిటిసి అభ్యర్థి అదపాక అప్పలరాజు, కృష్ణాపురం పంచాయతీ జనసేనపార్టీ యంపిటీసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, అదేగ్రామాలుకు చెందిన వీరు కట్ల కోటేశ్వారావు, ఈశర్ల ప్రకాష్ రావు, సువ్వల రాంబాబు, రేగాన తవుడు, ఆర్తి సత్యనారాయణ, కిల్లింశేట్టి. వెంకటరమణ, బీరికట్ల గోవిందరావు, ఏ వెంకటరావు, కోరాడు రమణ, ఈశర్ల శ్రీనువాసరావు, తదితరులు పాల్గొన్నారు.