అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చిన వంగ లక్ష్మణ్ గౌడ్

  • జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుల అరెస్ట్
  • న్యాయం కోసం పోరాటం చేస్తే అరెస్టులు చేస్తారా….?
  • మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు జనసేన పోరాటం ఆగదు.
  • జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్

హైదరాబాద్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వీరమహిళలను అలాగే గ్రేటర్ నాయకులను, జనసేన కార్యకర్తలను, వీరమహిళలను అక్రమంగా అరెస్ట్ చేయడం అమానుషం. దీనిని రాష్ట్ర యువజన విభాగం పూర్తిగా ఖండిస్తుంది. బాధితురాలికి న్యాయం జరిగే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలని
ఆదివారం తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో యువజన విభాగ నాయకులందరు అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేయాలి అని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ పిలుపునివ్వడంతో పలు జిల్లాల యువజన విభాగం నాయకులు నిరసన తెలియజేయడం జరిగింది.