వంతులు వారి సాగునీరు విడుదల రైతులకు నష్టం: రాయపూడి

అవనిగడ్డ నియోజకవర్గం: రేపటినుండి మొదలు అయ్యే వంతులు వారి సాగునీరు విడుదల రైతులకు నష్టమని జనసేన జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు పేర్కొన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ నిన్న నీటిపారుదల శాఖ అధికారులు ఒక ప్రకటన చేసినారు. తీవ్ర వర్షా భావ పరిస్థితుల వలన మరియు ఎగువన కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ మరియు పులిచింతల ప్రాజెక్టులలో సరిపడా నీటి నిల్వలు లేనందువలన ప్రకాశం బ్యారేజ్ నుండి కే.ఈ.బి (కరువు) కాలువకు పూర్తి స్థాయిలో నీటి విడుదల కానందువలన (పూర్తి స్థాయి నీటి విడుదల 1950 సి/ఎస్ అయితే కేవలం 1100 సి/ఎస్ మాత్రమే వదులుతున్నారు) నాగాయలంక మరియు కోడూరు సెక్షన్ల పరిధిలోని 70,000 ఎకరాల ఆయకట్టుకు నీటి ఎద్దడి నివారణకు పై అధికారుల ఆదేశానుసారం మరియు మన రైతులందరి సహకారంతో వంతుల వారి విధానము అమలు పరుచుటకు తీర్మానించినాము, అనే విషయం చాలా బాధాకరం. ఈ కార్యాలయ పరిధిలోని శ్రీకాకుళం, చల్లపల్లి మరియు మోపిదేవి సెక్షన్ల పరిధిలో కూడా అంతర్గత వంతుల వారీ విధానం ఇప్పటికే అమలులో ఉన్నది అనే విషయం సరిఅయినది కాదు. అలాగే యిందుమూలంగా దివి సీమ ప్రాంత రైతాంగానికి తెలియ పరచునది ఏమనగా మళ్ళీ విస్తారంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండే వరకు అందుబాటులో వున్న నీటి లభ్యతతో అందరికీ సమ న్యాయం చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఆగస్టు 17వ తారీఖు నుండి అనగా గురువారం ఉదయం 6.00 గంటల నుండి అవనిగడ్డ ప్రధాన రెగ్యులేటర్ వద్ద నుండి నాగాయలంక సెక్షన్ కి 3-1/2 రోజులు కోడూరు సెక్షన్ కి 3-1/2 రోజులు వంతులు వారీ విధానం అమలు పరచుటకు నిర్ణయించినాము, అనే మాట రైతులకు నష్టం జరుగుతుంది. ముందుగా నాగాయలంక సెక్షన్ కి వంతు విధానం అమలవుతోంది. అందువలన రైతులందరూ మీ యొక్క సహాయ సహకారాలు అందించి అందుబాటులో వున్న నీటిని వృధా చెయ్యకుండా నిలువ కట్టుకుని సాగు చేసుకుంటారని ఆశిస్తున్నాము అనే మాట అధికారులు నిరలక్ష్యంగా భావించాలి. ఎందుకు అంటే లక్షలు కొద్దీ క్యూసిక్కులు నీరు సముద్రం పాలు కావటం, ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ పై ప్రభుత్వం శ్రద్ద పెట్టకపోవటం వలన ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రైతులు సాగునీరుకు ఇబ్బంది పడకుండా పట్టీసీమా నుండి సాగునీరు విడుదల చేసినారు. ఇప్పుడు కుడా ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని పట్టీసీమా ద్వారా సాగునీరు అందించాలి అనీ జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము. ప్రస్తుతం ఎండలు బాగా వేస్తున్నాయి ఇలాంటి పరిస్థితి లో వంతులు వారి సాగునీరు విడుదల అనేది మంచి పద్దతి కాదు, ప్రభుత్వం, అధికారులు సాగునీరు విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోక పోవటం వలన ఈరోజున రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అధికారులుస్పందించి దయచేసి వంతులు వారి విధానం పెట్ట వద్దు అనీ రైతులు తరుపున జనసేన పార్టీ తరుపున కోరుచున్నామని రాయపూడి పేర్కొన్నారు.