వరికూటి అశోక్ బాబు మీకు దమ్ముంటే నా చాలెంజ్ స్వీకరించండి

  • టైము ప్లేస్ మీరు చెప్పండి నేను వస్తాను
  • నేను ఓడిపోతే జనసేన పార్టీ నుండి తప్పుకుంటాను,. మీరు ఓడిపోతే వైసిపి పార్టీ నుండి తప్పుకుంటారా.?

కొండెపి, నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో “జగనన్న కాలనీలు పేదలందరికి కన్నీళ్లు”(జగనన్న మోసం) అనే కార్యక్రమం మీద మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది. పొన్నలూరు మండలంలో ఇల్లు లేని నిరుపేదలు దాదాపు 3,000 మంది వరకు ఉన్నారు. కానీ వైసీపీ నాయకులు గుర్తించింది కేవలం 1100 మందిని మాత్రమే, తరవాత వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల నుండి బెదిరింపులకు గురిచేసి రిటర్న్ సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. మీరే ఇల్లు కట్టుకోవాలి మేము కట్టించము అని లబ్ధిదారులను బెదిరించి వారిని భయభ్రాంతులకు గురిచేసి మాకు ఇల్లు వద్దు అనే విధంగా ఈ వైసిపి నాయకులు చేయడం జరిగింది. సంతకాలు పెట్టకపోతే సంక్షేమ పథకాలు ఆపివేస్తాము అని కూడా బెదిరించడం జరిగింది. అలా పొన్నలూరు మండలంలో 700 నుండి 800 మంది వరకు ఇల్లు లేని నిరుపేదల దగ్గర రిటర్న్ సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు మండలం మొత్తం మీద ఫౌండేషన్ అయింది కేవలం 100 ఇల్లు మాత్రమే ఉన్నాయి. ఇంటిపైన స్లాబు వేసిన ఇల్లు కేవలం ఒక 50 మాత్రమే ఉన్నాయి, గృహప్రవేశం చేసిన ఇల్లు ఒక్కటి కూడా లేదు, పొన్నలూరు మండలంలో ఒక్కొక్క ఎకరం 10 లక్షలు ఉండి 15 లక్షలు వరకు ఖర్చు చేసి భూమి కొనుగోలు చేయడం జరిగింది, ఒక్కొక్క ఎకరంలో 30 నుండి 40 మందికి ప్లాట్లు ఇవ్వడం జరిగింది, దాదాపు మండలం మొత్తం మీద 40 నుండి 50 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. ఒక్కొక్క ఎకరం యావరేజ్ గా 10 లక్షలు వేసుకున్న 50 ఎకరాలు 5 కోట్లు అవుతుంది. 5 కోట్ల విలువ చేసే భూమిని కొని ఇప్పటివరకు ఒక గృహప్రవేశం కూడా చేయలేదు, వెంకుపాలెం, వెంకన్నపాలెం, ఎల్లటూరు, విప్పగుంట, చౌటపాలెం, చెరుకూరు, పెరికపాలెం, పైరెడ్డిపాలెం, నాగిరెడ్డిపాలెం, సుంకిరెడ్డిపాలెం, ముండ్లమూరివారిపాలెం, సింగరబొట్లపాలెం, తిమ్మపాలెం, భోగనంపాడు, రాజోలుపాడు, మేకపాడు, కోటపాడు, చెన్నిపాడు, ఎడ్లూరుపాడు, వేంపాడు, మాలపాడు, రావులకొల్లు, అగ్రహారం ముప్పాళ్ళ, ఉప్పలదిన్నె, పొన్నలూరు, ఇలా 24 పంచాయితీలో అవినీతి జరిగింది, వరికూటి అశోక్ బాబు గారికి దమ్ముంటే నా చాలెంజ్ స్వీకరించండి, నా పొన్నలూరు మండలంలో మీరు చెప్పిన జగనన్న కాలనీ దగ్గరకు నేను వస్తాను, మీరు కనీసం 100 ఇల్లు లబ్ధిదారులకు ఇప్పటివరకు ఇచ్చినట్టు చూపించండి. నేను మీకు క్షమాపణ చెప్పి జనసేన పార్టీ నుండి తప్పుకుంటాను. మీరు చూపించలేకపోతే వైసిపి పార్టీ నుండి తప్పుకోండి…? మీరు జగనన్న కాలనీలో ఇల్లు కట్టి లబ్ధిదారులకు ఇవ్వలేదు అని ఆధారాలు నేను చూపించగలను, నాలాగా మీరు జగనన్న కాలనీలో ఇల్లు కట్టి పేద ప్రజలకు ఇచ్చాము అని ఆధారాలు ప్రజలకు మీరు చూపించగలరా…? పొన్నలూరు మండలంలో అవినీతి పరాకాష్టలో ఉంది మరియు అగ్రస్థానంలో ఉంది. అభివృద్ది మాత్రం శూన్యంగా ఉంది, కోట్ల రూపాయలు ఏమయ్యాయి…? మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు…? ఎవరిని అభివృద్ధి చేశారు…? జడ్పిటిసి ఏమి చేస్తున్నారు…? ఎంపిపి ఎక్కడున్నారు…? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి…? అని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు “కనపర్తి మనోజ్ కుమార్” వైసీపీ ఇన్చార్జి “వరికూటి అశోక్ బాబు”ని నిలదీసి అడగడం జరిగింది.