జనవాణిలో పలు సమస్యలపై వినతిపత్రమిచ్చిన వీరఘట్టం జనసేన నాయకులు

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేన భరోసా జనవాణి కార్యక్రమానికి వీరఘట్టం మండలం జనసేన పార్టీ నాయుకులు, జనసైనికులు వెళ్లడం జరిగింది. ముందుగా జనసేన జానీ మాట్లాడుతూ ఆటో కార్మికులు దశాబ్దాలుగా పడుతున్నటువంటి కష్టాలు అలాగే వారికి భవిష్యత్తులో హెల్త్ కార్డు పెన్సన్స్ ఇవ్వాలి ఇప్పించాలని జనసేన పార్టీ అధినాయకుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. రౌతు గోవింద నాయుడు మాట్లాడుతూ వీరఘట్టం మండలంలో ఇంటర్ డిగ్రీ విద్యార్థులకి ఒకే కాలేజ్ లో తరగతిలు నిర్వహించడం వలన విద్యార్థులు చదువుపైన ఆ ప్రభావం చూపెడుతుండటం వలన ఇంటర్ కి డిగ్రీకి వేరు వేరు కాలేజీలు ఉండేలా చూడాలని, అలానే కిమ్మి బ్రిడ్జి ఎలా తరబడి సమస్య పరిస్కారం అవ్వక చుట్టూ పక్కల మండలాల వారు ప్రయాణానికి ఇబ్బందులు పడుతుండటం వలన బ్రిడ్జి పని పూర్తి అవ్వాలని కోరుకుంటున్నానని వివరిస్తూ లెటర్ ఇవ్వడం జరిగింది. రౌతు భాస్కర్ రావు మాట్లాడుతూ వీరఘట్టం మండలంలో కాంప్లెక్స్ లేకపోవడం వలన ప్రయాణీకులు చాలా అవస్థలు ఇబ్బందులు పడుతుండడం వలన కాంప్లెక్స్ నిర్మించాలని ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పడం జరిగింది.