జీవో నెంబర్.1 ను తక్షణమే రద్దు చేయాలి: మత్స పుండరీకం

  • ప్రవాస భారతీయుల దినోత్సవ వేడుకలలో వీరఘట్టం జనసేన

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో సోమవారం ప్రవాస భారతీయుల దినోత్సవంను పురస్కరించుకుని పాలకొండ జనసేన ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పువ్వుల మాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్సీపీ ప్రభుత్వం అమలులోనికీ తెచ్చిన జీవో నెంబర్.1 ని తక్షణమే రద్దు చేయాలి జనసేన పార్టీ నాయకులు నోటికి రుమాల్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మత్స పుండరీకం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ నూతన సంవత్సర సంక్రాంతి కానుకగా జి.ఓ నెంబర్ 1 ఇచ్చారు, నిర్బంధ, చీకటి జీఓ తో రహదారులు, వీధుల్లో, సమావేశాలు, ర్యాలీలు చేయకుండా నిర్బంధాన్ని తీసుకురావడం హక్కులకోసం పోరాడే వ్యక్తులకు, ప్రశ్నించే వ్యక్తుల, ప్రజాస్వామిక శక్తుల గొంతు నొక్కడమేనని దీనిని తక్షణమే రద్దు చేయాలని, జీఓ1 రద్దు అయ్యేవరకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాడాలని పుండరీకం పిలుపునిచ్చారు. పౌరహక్కులపై నిర్బంధం తీసుకురావడం సరైన చర్య కాదన్నారు. హక్కులను కాలరాసే జీఓ 1ని తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.