డిజిటల్ క్యాంపెయిన్ లో మూడవ రోజు వీరఘట్టం జనసేన

*గుడ్ మార్నింగ్ సి ఎమ్ సార్…
*గాఢ నిద్ర నుండి లేవండి సీఎం సారు…
*రోడ్లు రిపేర్ చేయండి సీఎం సారు…
* నినాదాల చేసిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స.పుండరీకం మాట్లాడుతూ రోడ్ల దుస్థితి తెలుపుతూ ఆదివారం డిజిటల్ క్యాంపెయిన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం అని తెలియజేసారు.

*ప్రతి రోడ్ల మీద గుంతలు స్టేట్ హైవే కావచ్చు, జిల్లా కేంద్ర కి కలిపే దారులు కావచ్చు, పల్లెల కనెక్టవిటీ రోడ్లు కావచ్చు, మన వీధి ముందుండే రోడ్లు కూడా గోతులు మయం. ఎక్కడ చూసినా గోతులు ఇది ఒక గోతులఆంధ్రప్రదేశ్ లాగా తయారయింది.

గత సంవత్సరం జనసేన పార్టీ చేపట్టిన #JSPForAp_Roads డిజిటల్ క్యాంపెన్ ద్వారా రాష్ట్ర లో రహదారుల పరిస్థితి తెలియజేశాము. నాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు 2022 జూలై 15 కి రాష్ట్రంలో రోడ్ల అన్ని మరమ్మతులు చేసి ప్రతిపక్షాల నోళ్లు ముయిస్తాం ఫోటోలు అప్లోడ్ చేస్తాం అని సవాల్ విసిరారు మరి నేడు మాటతప్పారు – మడమ తిప్పారు.

మీ సవాలును గుర్తు చేస్తున్నాము సీఎం సార్.. ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో తెలుపుతూ #GoodmorningCMSir అనే హష్ టాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా చివరి రోజు ఆదివారం కలింగపట్నం – పార్వతీపురం ప్రధాన రహదారి లో వీరఘట్టం మండల కేంద్ర నుండి వివిధ గిరిజన ప్రాంతాలకు వెల్లు రహదారి చిట్టపుడివలస, కకితాడా, దసుమంతపురం, నరిసిపురం, పెద్దూరు, సవర గోపాలపురం, జియ్యమవలస మండలం వరకు రోడ్డు పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు మత్స పుండరీకం, జనసేన జాని, కోడి వెంకటరావు నాయుడు పరిశీలించారు.

ప్రతి మీటరు మీటరకు గోతులు ఉన్నాయి, ప్రజల బతుకు భారమైపోతుంది ఈ గుంతల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రజల ఆరోగ్య పరిస్థితి పాడవుతుంది, ప్రాణాలు పోతున్నా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం గాఢ నిద్రలో ఉంటూ పాలన చేస్తున్నారు.
కాబట్టి ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గారు నిద్రలేచి రాష్ట్రంలో గోతులు పూడ్చి రోడ్లను బాగుచేయాలని కోరుకుంటున్నాం. సెస్ ల రూపంలో, పెట్రోల్ డీజిల్ మీద పన్నుల రూపంలో వాటి మీద అప్పులు తెచ్చి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు కాని రహదారులు మరమ్మతులు చేయడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అంటు ప్రజలను మోసం చేయడం న్యాయమా అని మత్స పుండరీకం అన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు బాగా చేసింది దాఖలాలు కనిపించడం లేదు.
పక్క రాష్ట్రాల వాళ్లు కూడా రోడ్ల పరిస్థితి చూసి ట్రాన్స్పోర్టేషన్ కి మన రాష్ట్రానికి రావట్లేదు. మౌలిక వసతులు మన రాష్ట్రం లో లేవంటూ హేళన చేస్తున్నారు అని మత్స పుండరీకం అన్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రోడ్ల దుస్థితి వివరిస్తూ మీ చుట్టూ పక్కల ప్రాంతంలో, పరిసరాల్లో ఎక్కడ గోతులు కనిపించినా ఫోటో తీసి ఈ కాంపెయిన్ లో #GoodmorningCMSir హ్యాస్ ట్యాగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కి తెలిసేలా చేసిన జనసైనికులకు పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజెసారు.

జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపెద్ద వాగ్దానాలు చేస్తారు కానీ ఆ కలల నుంచి గాఢనిద్ర నుంచి మేల్కొని వెంటనే రోడ్లు బాగు చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని జనసేన జాని, కర్నేన సాయి పవన్ అన్నారు.

ఈ కార్యక్రమంలో సుమన్, ప్రణీత్, అన్ను రామకృష్ణ, వావిలిపల్లి నాగభూషణ, దండేలా సతీష్, బి.పి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.