వేముల శ్రీనివాస్ రాజీనామా చేయాలి: బైరి వంశీ కృష్ణ

వరంగల్: ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కబ్జా చేస్తూ, అక్రమంగా ఆక్రమిస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాలనీ జనసేన పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాయకులు బైరి వంశీ కృష్ణ డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార మదంతో స్థానిక ఎమ్మెల్యే అండదండలతో విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్న కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలి. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల ఆస్తులను కబ్జాలు చేస్తుంటే ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదని వంశీ కృష్ణ ప్రశ్నించారు.