గంపాలగూడెంలో ఘనంగా జనసేన క్రియాశిలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం గంపాలగూడెం మండలంలో ఘనంగా ప్రారంభమైన జనసేన పార్టీ సభ్యత్వ కిట్ల పంపిణీ ఆదివారం ఉదయం 9 గంటలకు గంపాలగూడెం మండలంలోని గంపాలగూడెం గ్రామంలో గంపాలగూడెం మండల అధ్యక్షులు వెంకట కృష్ణ మరియు మండల కార్యవర్గం ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉమ్మడి కృష్ణాజిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి మానాబోలు శ్రీనివాసరావు చేతుల మీదగా వీరిని సత్కరించడం మరియు సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీరు పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ విధివిధానాలను జనసైనికులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండలం పార్టీ అధ్యక్షులు చింతలపాటి వెంకట కృష్ణారావు, తిరువూరు నియోజకవర్గం నాయకులు పగడాల లక్ష్మణ రావు, ఉయ్యూరు జయ ప్రకాష్, పసుపులేటి రవీంద్ర, గాదేవారిగూడెం జనసేనపార్టీ సర్పంచ్ చిన్న శ్రీనివాసరావు మండలం కార్యవర్గం రామకృష్ణ, బాలకృష్ణ, కృష్ణ, రవి, మాధవరావు మరియు జనసేనపార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.