ఓఎన్జీసీపై పోరాడి గెలిచిన వెంకటపతి రాజా కృషి అభినందనీయం

* జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు
చమురు, సహజ వాయువుల సంస్థలైన గెయిల్, ఓఎన్జీసీ సంస్థలపై గత రెండేళ్లుగా న్యాయ పోరాటం చేసి గెలిచిన రాజోలు నియోజకవర్గంకు చెందిన జనసైనికుడు వెంకటపతి రాజా కృషి అభినందనీయమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు ప్రకటించారు. కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ) కారణంగా భావించి రూ. 22.72 కోట్ల జరిమానా విధిస్తూ చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. గెయిల్, ఓఎన్జీసీ సంస్థల కారణంగా, కోనసీమలో జరుగుతున్న అన్వేషణల ఫలితంగా జల కాలుష్యం ఏర్పడుతోందని వెంకటపతి రాజా 2020లో ఆధారాలతో సహా “నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్”లో ఫిర్యాదు చేసారు. పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడ్డ గెయిల్, ఓఎన్జీసీ సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్జీటీ ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. ఓఎన్జీసీకి రూ.22.72 కోట్ల  జరిమానా విధించింది. జనసేన సిద్ధాంతాలలోని ప్రధానమైన పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడి గెలిచిన వెంకటపతి రాజా జనసేన శ్రేణులకు ఆదర్శంగా నిలిచారని నాగబాబు అభినందించారు.