పండూరు జనసేన ఆధ్వర్యంలో గ్రామకమిటీ సమావేశం

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అభివృద్ధి, నిర్మాణం, గ్రామ సమస్యలపై అవగాహనా, ప్రభుత్వ పనితీరు తదితర అంశాలపై గ్రామకమిటీ సభ్యులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం పండూరు గ్రామకమిటీ వారితో కాకినాడ పంతం నానాజీ స్వగృహం వద్ద పండూరు గ్రామకమిటీ అధ్యక్షులు నందిపాటి దుర్గబాబు అధ్యక్షతన గ్రామ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి వచ్చిన వారందరికీ ముందుగా అల్పాహారం అందించిన తరువాత.. నూతన గ్రామ కమిటీ సభ్యులను దుస్సాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపి, వారికీ దిశానిర్దేశం చేసి, ప్రతి గ్రామ కమిటీ సభ్యులు తమ ఇంటిపై జనసేన జండా ఎగురవేయాలని, పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజహిత కార్యక్రమాలను గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలియచేయాలనీ, అలానే వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలనీ, నా వద్దకి వచ్చిన వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, పండూరు ఎంపీటీసీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, నందిపాటి రమణ, నందిపాటి పల్లయ్య ,కరప మండల అధ్యక్షులు బండారు మురళి,రాష్ట్ర కమిటీ జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు, బోగిరెడ్డి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శిరంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.