బూర్జవలస గ్రామంలో పల్లె పల్లెకు జనసేన

  • మన బ్రతుకులు మార్చడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్
  • కుంకుమ దిద్ది, హరతులతో నీరాజనాలు పలికిన ఎస్.బూర్జవలస గ్రామస్తులు

గజపతినగరం నియోజకవర్గం: పల్లె పల్లెకు జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా గజపతినగరం నియోజకవర్గం, దత్తిరాజేరు మండలం, ఎస్. బూర్జవలస గ్రామంలో జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతీఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలతో కూడియున్న కరపత్రాలను పంచుతూ ప్రజలందరికి అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేస్తున్న రైతు భరోసా సాయం, ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజావాణి మొదలగు సేవలను ప్రజలకు వివరించారు. గ్రామస్తులు బొట్లు పెట్టి, హరతులతో జనసేన నాయకులకు నీరాజనాలు పలికారు. ఈ సందర్బంగా నాయకులు సురేష్ మాట్లాడుతూ మన బడుగు బలహీన వర్గాల జీవితాలను మార్చడానికి వచ్చిన నిస్వార్థ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో ఈసారి నిజాయితీతో పార్టీ పెట్టిన జనసేన అభ్యార్థులకు వేసి గెలిపించిమని అభ్యర్థిస్తున్నామని, ఖచ్చితంగా రాష్ట్రంలో జెండా మారితే సామాన్యుల బతుకులు మారడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు డా.మిడతాన రవికుమార్, దత్తిరాజెరు మండల నాయకులు భాస్కర్ రావు, లోకేష్, చరణ్, అనిల్, సూర్య, సురేష్, అశోక్, లక్ష్మీనారాయణ, గజపతినగరం మండలం నాయకులు కలిగి పండు, కే.శ్రీను, ఆదినారాయణ, మహేష్, శంకర్, చలం, హేమ సుందర్, శ్రీను, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.