పౌర గ్రంథాలయమునకు నిధులు కేటాయించాలి

విశాఖపట్నం: పెదగంట్యాడ పౌర గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుందని పాఠకులు తెలియజేయడంతో కొద్ది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది. కానీ కొత్త గ్రంథాలయ నిర్మాణ పనులు ఇంకా నిర్మాణ మొదలు పెట్టకపోవడంతో 75వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు, గాజువాక మాజీ మున్సిపల్ చైర్మన్ కోన చిన అప్పారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోన చిన అప్పారావు మాట్లాడుతూ పౌర గ్రంథాలయం పునః నిర్మాణానికి కేటాయించిన 9.30 లక్షల రుపాయలు సంబంధించి పనులు ఇంతవరకు ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పడగొట్టిన గ్రంథాలయం సంపూర్ణ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించి విడుదల చేయాలని, నిర్మాణ పనులు తక్షణమే మొదలుపెట్టి పాఠకులకు మరియు ప్రజలకు అందుబాటులో ఉంచాలని గ్రంథాలయం అధికారికి, జీవీఎంసీ కమిషనర్ కు, గాజువాక ఎమ్మెల్యే గారిని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు బొట్టా నర్సింహారెడ్డి, అంజూరి దీపక్, నాట్ర నాని బాబు, నమ్మి లోకేష్, నామాల అర్జున్, మొల్లి మారినాయుడు, నీలాపు శ్రీనివాస్ రెడ్డి, ములకలపల్లి వంశీ, నీలాపు అప్పల రెడ్డి, కోన అప్పారావు(శివ), కోన అప్పారావు (చంటి), కోన రమణ, కేత రమేష్, మొల్లి వెంకటేశ్, మొల్లి పెంటయ్య, మొల్లి అప్పల స్వామి, ఉరుకూటి అప్పారావు, భాను, నాగేంద్ర, లక్ష్మణ్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.