గురజాడ అభ్యుదయ దార్శనికుడు: గురాన అయ్యలు

విజయనగరం: మహాకవి గురజాడ అప్పారావు గొప్ప సంఘ సంస్కర్త, ఆధునిక అభ్యుదయ వాది అని జనసేన నేత గురాన అయ్యలు పేర్కొన్నారు. గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకొని గురాజాడ స్వగృహంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గురజాడ రోడ్డులో గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ సమాజానికి గురజాడ చేసిన సేవలను కొనియాడారు. తన రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చారని, ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తోటి వారికి సహాయాన్ని అందించాలని గురజాడ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఆయన ఆశయాలను భావి తరాలకు అందించడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డి.రామచంద్రరాజు, విసినిగిరి శ్రీనివిసరావు, కాటం అశ్వని, మాతా గాయిత్రి, దుప్పాడ లక్ష్మీ, పితాల జ్యోతి, చక్రవర్తి, ఎల్. రవితేజ, ఏంటి రాజేష్, అడబాల వేంకటేష్, ఎమ్. పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, అభిలాష్, సాయి, సురేష్ కుమార్, హిమంత్ కుమార్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.