కేశవదాసుపాలెంలో గోదావరిని తలపిస్తున్న జగనన్న కాలనీలు

  • కేశవదాసుపాలెంలో జగనన్న కాలనీల సందర్శన

రాజోలు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు #failureofjaganannacolony డిజిటల్ క్యాంపెనింగ్ కార్యక్రమంలో భాగంగా రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్ అధ్వర్యంలో కేశవదాసుపాలెం గ్రామంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను
శనివారం పరిశీలించి, కాలనీల పరిస్థితిపై మాట్లాడుతూ.. పేదలకు కేటాయించిన ఇల్లు స్థలాలు గోదావరిని తలపించేలా ఉన్నాయి, కనీసం పట్టాలు పొందిన లబ్ధిదారులు కూడా గుర్తించలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది, గత నాలుగు సంవత్సరాలుగా వాటిని అలా వదిలేసారని, ఆ కాలనీలో పేద ప్రజలు ఎలా జీవించగలరని ప్రశ్నించారు. పేదల కోసం గోదావరిని తలపించేలా వైసిపి ప్రభుత్వం కేటాయించిన జగనన్న కాలనీలో ప్రస్తుతం పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాడి నాలుగు సంవత్సరాల గడిచినా నేటికి ఇలానే ఉన్నాయి. ఈ కార్యక్రమంలోరాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, నాలుగు మండలాల అధ్యక్షులు, సర్పంచ్ లు ఎంపీటీసీలు, జనసేన నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.