చింతలపాడు గ్రామంలో తంబళ్ళపల్లి రమాదేవి పర్యటన

నందిగామ నియోజకవర్గం: పల్లె పధాన జనసేన కార్యక్రమంలో భాగంగా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పర్యటించారు. గ్రామంలో పర్యటించి గ్రామస్తులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని, జనసేన టిడిపి ప్రభుత్వం స్థాపించిన వెంటనే వారి సమస్యలకు పరిష్కారం దిశగా కృషి చేస్తానని భరోసాను ఇచ్చారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ గ్రామంలోని లోకేశ్వరి అమ్మవారి ఆలయం నుండి నియోజకవర్గ స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. నందిగామ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, చింతలపాడు గ్రామంలో జనసేన పార్టీ అభిమానులు సానుభూతిపరులు అధిక సంఖ్యలో ఉన్నారు, మీరంతా ఏకం అయ్యి వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి, మన నందిగామ అభివృద్ధిని మనమే చేసుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చందర్లపాడు మండలాధ్యక్షులు వడ్డెల్లి సుధాకర్, ఉపాధ్యక్షులు పురం శెట్టి నాగేంద్ర, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.