పిఠాపురం మహారాజ విగ్రహానికి నివాళులర్పించిన డా. పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం పట్టణం నందు పిఠాపురం మహారాజా వారి 59వ వర్ధంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం కోట గుమ్మం సెంటర్ నందు గల మహారాజా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం మహారాజ వారు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అప్పట్లోనే విద్య వల్లే అన్ని రంగాల్లోనూ యువత ముందుకు వెళుతుందని గ్రహించిన మహారాజ వారు అనేక విద్యాసంస్థలను నిర్మిస్తూ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ పిఠాపురం కాకినాడ పెద్దాపురం అనేక చోట్ల లక్షల్లో డొనేషన్ వేస్తూ అనేక ఎకరాల స్థలాలు విద్య కోసం రాజావారు తన భూములను ఇవ్వడం జరిగిందని అదేవిధంగా లండన్ విదేశాల్లో కూడా విద్యకు ప్రాధాన్య ఇస్తూ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడవాల్సి ఉందని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, పీ ఎస్.ఎన్ మూర్తి, మెల్లం రామకృష్ణ (టైల్స్ బాబీ), మాజీ నీటి సంఘం అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చోడిశెట్టి శేషగిరిరావు, గంటా బాబీ, ఎండ్రపు శ్రీనివాసరావు, వినుకొండ అమ్మాజీ, ముప్పన్న రత్నం, మిరియాల చిట్టీ, నంద్యాల నాగబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.