Tanuku: విశాఖ పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేన పిలుపు

ఈ నెల 31 తారీఖున జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభకు ఛలో వైజాగ్ కు పిలుపునివ్వడం జరిగింది ఈ విషయము తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశమునకు జనసేనపార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ సభను విజయవంతం చేయాలని, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.