Nuzvid: 31న ఛలో స్టీల్ ప్లాంట్ ని జయప్రదం చేయండి – జనసేన శ్రేణుల పిలుపు

ఈ నెల 31న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో జరిగే శ్రీ పవన్ కళ్యాణ్ సంఘీభావ సభని జయప్రదం చేయాలని నూజివీడు నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు మరీదు, శివ రామకృష్ణ పులుపు నిచ్చారు. శుక్రవారం నూజివీడులో జరిగిన పత్రికా విలేకర్ల సమావేశంలో వీరు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పోరాటానికి అండగా ఉండాలని ఉక్కు సమితి విజ్ఞప్తి చేయగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆహ్వానం మేరకు జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఈ నెల 31వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్లి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలిసి వారు నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొంటారని తెలియచేసారు. 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాం అంటే మొట్టమొదటిసారిగా ఢిల్లీలో కేంద్రంతో మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన తెలిపారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది వైసీపీ ఎంపీలు, 3 మంది టీడీపీ ఎంపీలు, 23 ఎమ్మెల్యేలు ఉండగా వారి వలన ఉపయోగంలేదని తెలిసి కేవలం పవన్ కళ్యాణ్ వలనే ఈ స్టీల్ ప్లాంట్ ని కాపుడుకోగలం అని జనసేనపార్టీ తరపున గళం వినిపించాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి వారి కోరిక మేరకు స్టీల్ ప్లాంట్ ఆవరణలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మరియు నూజివీడు నియోజకవర్గం నుంచి వీరమహిళలు, జనసైనికులు, తరలిరావాలని ఉక్కు భాదితులకు జనసేనపార్టీ తరుపున అండగా ఉండాలని ఆయన తెలియచేసారు. ఈ సమావేశంలో నూజివీడు జనసేన నాయకులు ఏనుగుల చక్రి, ఎం సునీల్ కుమార్, ఇంటూరి చంటి, యాదాల వెంకట్, శివకృష్ణ, చాట్రాయి మండలం నాయకులు తుమ్మల జగన్, ఆరెల్లి కృష్ణ, వలసపల్లి రామకృష్ణ, గొడవర్తి రాంబాబు, అడిమిల్లి వాసు, వంశీ తదితరులు పాల్గొన్నారు.