డా.యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో ఓటర్ వెరిఫికేషన్

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, కార్వేటి నగరం గ్రామపంచాయతీ, విజయ మాంబాపురం గ్రామంలో జనసేన పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. త్రాగునీరు చేతిబోరు ఉపయోగంలో లేకపోవడం వల్ల, తాగునీటికి ఇబ్బంది కలిగినప్పుడు గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. మండల అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి, చేతి బోరును ఉపయోగంలోకి తీసుకు రావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, కార్వేటి నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు సూర్య నరసింహులు, జిల్లా సంయుక్త కార్యదర్శి నరేష్, జనసేన పార్టీ నాయకులు గజేంద్ర, నియోజకవర్గ ఇన్చార్జి మరియు స్రవంతి రెడ్డి పాల్గొన్నారు.