రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనున్న వారాహి యాత్ర

  • 151 తలల జగణాసురుడిని రాజకీయ సంహారం చేసేందుకు రామావతారం ఎత్తిన పవన్ కళ్యాణ్
  • వారాహియాత్రతో వైసీపీకి రాజకీయ సమాధి తప్పదు
  • జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: అవినీతి, బంధుప్రీతి, కుల పిచ్చి, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు, గంజాయి, ఎర్ర చందనం స్మగ్లింగ్ లు అన్నింటికి మించి నియంత పాలనతో పరిపాలనా వ్యవస్థలన్ని నిర్వీర్యం అవుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకురానుందని గుంటూరు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. బుధవారం అన్నవరం సత్యదేవుని దివ్య ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహియాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా కొనసాగాలని కోరుతూ మంగళవారం కొత్తపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 301 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని సృష్టించే ఈ వారాహియాత్రతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారనుందన్నారు. ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పదేళ్లుగా ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో అవమానాలను ఎదుర్కొని పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతీఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఒక మూసలో వెళ్తున్న రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని, సామాన్యుడు కూడా రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం కావాలి అంటూ పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యే సమయం ఆసన్నమైందన్నారు. డబ్బుని, కులాన్ని కాకుండా సమాజం పట్ల ప్రేమ, దేశం పట్ల భక్తి ఉన్నవారికే జనసేనలో అగ్రస్థానాన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ పేర్కొన్నారు. వారాహియాత్ర మొదలవ్వక ముందే వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. ఇప్పటివరకు వారాహి అనే పేరుని, వాహన రంగుని చూసే దడుచుకున్న వైసీపీ నేతలకు వారాహి యాత్రతో రాజకీయ సమాధి తప్పదని జోస్యం చెప్పారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు పార్వతి నాయుడు, పాకనాటి రమాదేవి, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మిలు వారాహియాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగర కమిటీ ఉపాధ్యక్షులు కొండూరు కిషోర్ కుమార్, చింతా రేణుకారాజు, ప్రధాన కార్యదర్శిలు ఆనంద్ సాగర్, సూరిశెట్టి ఉదయ్, కటకం శెట్టి విజయలక్ష్మి నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.