9వ వార్డులో త్రాగు నీటి సమస్య ఎక్కువగా ఉంది: జనసేన కౌన్సిలర్ విజయలక్ష్మి

కోన సీమజిల్లా, అమలాపురం పురపాలక సంఘ సమావేశం చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 9వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి మా వార్డులో తాగు నీటి సమస్య ఎక్కువగా ఉందని, 10రోజులకు కూడా వాటర్ టాంకర్ రావడం లేదని, వార్డులో ప్రజలు ఇబ్బందులు పడుచున్నారని ప్రశ్నించారు. దానికి ఏ ఇ వెంకటేశ్వరావు సమాధానమిస్తూ.. తాగునీరు ఎపుడు కావలిసినా వెంటనే ఫోన్ చేయండి పంపుతాము. మూడు రోజులకు ఒకసారి తాగునీటి ట్యాంకర్ తిప్పుతాము, ఇక నుండి ఆ సమస్య ఉండదని తెలిపారు.