టిడ్కో ఇళ్ళ అసంపూర్ణ నిర్మాణం కారణంగా ప్రజా ధనం వృధా!: లక్ష్మణ కుటాల

  • పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను త్వరగా నెరవేర్చాలి!

సత్యసాయి జిల్లా: పేద, మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన జి+3 హౌసెస్ అసంపూర్ణ నిర్మాణం కారణంగా ప్రజాధనాన్ని వృదా చేసి కాలయాపన చేస్తున్నారు.

కదిరి మునిసిపల్ పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్ళ నిర్మాణం పనులు సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు మోక్షం ఎపుడు కలిగిస్తారని లబ్ది దారులు ఆవేదన వ్యక్తంచేశారు.

నాయకుల నిర్లక్ష్యమా..?? లేక అధికారుల నిర్లక్ష్యమా..?? పేద ప్రజల సొంత ఇంటి కల కలగానే మిగిలిపోవాల్సి వస్తుంది. గతంలో లబ్ది దారుల దగ్గర ఇళ్ళ కేటాయింపు కోసం (లాటరీ పద్దతిలో) డబ్బులు కూడా వసూలు చేశారు మునిసిపల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి దారులు మాత్రం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఇళ్లను కేటాయిస్తామని చెప్తున్నారు గతంలో పేద మధ్యతరగతి ప్రజలు దగ్గర వసూలు చేసిన డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చి, జి+3 ఇళ్ళ నిర్మాణం తొందరగా పూర్తి చేసి పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను తొందరగా తీర్చాలని కదిరి జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నామని, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీ సత్యసాయి జిల్లా, కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల తెలియజేసారు.