ఇంగ్లీష్ మీడియంకే కట్టుబడి ఉన్నాం

కేంద్రం కొత్త జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించిన మేరకు కేంద్ర కేబినెట్ లో ఆమోదించి అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా భోధన ఉండేలా చూసుకోవాలని సూచించిన సంగతి అందరికి తెలిసిన విషయమే.

ఏపీలో మాత్రం సీఎం జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంకే మొగ్గుచూపుతోంది. మాతృభాషలోనే బోధన ఉండాలన్నది కేంద్రం నిర్ధేశించలేదని ఏపీ ప్రభుత్వ వర్గాలు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్య ఉమ్మడి అంశం కాబట్టి రాష్ట్రాల పరిస్థితులు ఆకాంక్షల ప్రకారం నడుచుకోవచ్చని చెబుతోంది. రాష్ట్రాల సాధ్యసాధ్యాలను బట్టి అమలు చేయాలని ఆలోచిస్తుంది.

అయితే ఏపీలో మాత్రం సీఎం జగన్ ఈ విద్యాసంవత్సరం మొదట్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి డిసైడ్ అయ్యారు. ప్రతిపక్ష చంద్రబాబు అండ్ మీడియా జగన్ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేసింది. హైకోర్టుకు వివాదం చేరగా.. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం ఇంగ్లీష్ మీడియంపై ముందుకెళ్లాలని ఆదేశించింది.

దీంతో ఏపీ ప్రభుత్వం విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది. 97శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కావాలని కోరారు. 3శాతం మంది మాత్రమే తెలుగు మీడియంకు ఓటేశారు. ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్న చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో కూడా ఇంగ్లీష్ మీడియం కావాలని తీర్మానం చేసి పంపించారు. దీంతో ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంగ్లీష్ మీడియంకే కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు.