దళితులకు న్యాయంకోసం మేము సిద్ధం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో సిటి సహాయ కార్యదర్శి కంటా రవిశంకర్ ఆధ్వర్యంలో అనసూయమ్మమూర్తి కోలనీ, రేచర్ల పేటలో దళితులకు న్యాయంకోసం మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజల మీద యుద్ధం చేస్తున్నాడన్నారు. ఇక్కడ ఉంటున్న దళిత కుటుంబాలు అంబేడ్కర్ సాక్షిగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెపుతున్నారన్నారు. 27 పధకాలు తీసేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎవ్వరికి కూడా న్యాయం చేయలేదన్నారు. నా దళితులు అని చెప్పడం తప్ప ఇక్కడున్న వీళ్ళకి ఓల్డ్ ఏజ్ పించను తప్ప మరే కార్యక్రమాలు రావడంలేదని వాపోతున్నారన్నారు. ఉదాహరణకి అక్కడున్న ఒక మహిళకి ఇల్లు లేదు వీళ్ళు ఇవ్వలేదు చిన్నపిల్లలతో ఉన్న ఈవిడ జీవితం ఏలా సాగించాలని బాధపడుతోందన్నారు. ఇక్కడున్న దళితులు చదువుకోడానికున్న అంబేడ్కర్ హాస్టల్ని కూడా మూసేసారనీ, ఎందుకని మేము ప్రశ్నిస్తే ఇంకా పెద్ద భవనం కడతామంటున్నారనీ అది ఇన్నాళ్ళయినా మొదలేకాలేదన్నారు. ఆనాడు ఎన్.టి.ఆర్ ఇచ్చిన ఓల్డ్ ఏజ్ పించలు తప్ప ఇక్కడ కొత్తగా ఇచ్చినది ఏమీలేదనీ మరి ఈ ముఖ్యమంత్రి దేనికి సిద్ధం అంటున్నాడని ప్రశ్నించారు వీళ్ళని ఊరినుండీ తరిమెయ్యడానికా లేక వల్లకాడులోకి తోసెయ్యడానికా వీళ్ళ జీవితాలు నాశనంచేసి విధ్వంశం చేయడానికా దేనికి మీరు సిద్ధం అంటున్నారని తూర్పారబట్టారు. మానవతా వాదమున్న మంచిమనిషి పవన్ కళ్యాణ్ గారు అనీ, ఆయన పేదల అభ్యున్నతికోసం ప్రతి నిమిషం ఆలోచనలు చేస్తుంటారన్నారు. ఆయన నాయకత్వంలో ఉమ్మడికూటమి ప్రభుత్వాన్ని నెలకొల్పితే అధ్భుతాలు చేస్తారనీ తీసేసిన పధకాలను పునరుద్ధరించడానికి మేము సిద్ధం అని నినాదాలు చేసారు. జనసేన పార్టీ దళితులకి న్యాయం చేయడానికి సిద్ధం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, పచ్చిపాల మధు, నావిటి శేఖర్, డి రమేష్ నాయుడు, కీర్తి, రమణమ్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు.