సంజయ్ నగర్ ప్రాంతంలో మేము సిద్దమే కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో 12 డివిజన్ సంజయ్ నగర్ ప్రాంతంలో సాయం సాయికుమార్ మరియు శ్రీమతి దుర్గ ఆధ్వర్యంలో మన నివాసానికి ఇళ్ళు కావాలి మన కాకినాడ లొనే అని అంటూ మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గర పడ్డాకా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలమీద వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్నారనీ నాకోసం మీరు రెండు సార్లు బటన్ నొక్కమని అంటున్నారనీ, కాకినాడ సిటి ప్రజలు ఎందుకు బటన్ నొక్కాలో చెప్పమంటున్నారన్నారు. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వీరి కంటికి ఎదురుగా ఖాళీ నివాస స్థలాలు కనిపిస్తున్నాయనీ, కానీ వీళ్ళందరినీ తీసుకెళ్ళి కొమరిగిరిలో నివాసానికి ఇళ్ళు ఇస్తున్నారనీ, వీళ్ళకి ఈ ఊరిలో ఇళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశం ఈ స్థానిక ఎం.ఎల్.ఏ ద్వారంపూడికి గానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గానీ లేదనీ ఈ భూములని వేరే వాటికి వాడుకోవాలని, వీరు మనసులో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసారని అర్ధమవుతోందన్నారు. దానికి ఇబ్బందిలేకుండా తెలివిగా వీరిని తప్పిస్తూ కొమరిగిరికి తరలిస్తున్నారన్నారు. ఇదే వాస్తవం, ఇదే నిజం అని ఉద్ఘాటించారు. ఇక్కడి భూమి ఇక్కడి వాళ్ళకి ఇస్తే వీళ్ళందరూ సుఖంగా ఉంటారనీ తన తండ్రిగారు ముత్తా గోపాలక్రిష్ణ గారు తన హయాములో మూడు అంతస్తులు కడితే, చంద్రబాబు నాయుడు గారి హయాములో నాలుగు అంతస్తులు నివాసాలను కట్టారనీ ఇపుడు కావాలంటే ఇక్కడ ఆరు అంతస్తుల నివాశ సముదాయాన్ని కట్టి ఇవ్వచ్చు టూబెడ్ రూం ఇళ్ళు కూడా ఇవ్వచ్చు అంత భూమి ఇక్కడ ఉందనీ, కానీ ఇచ్చే మనసే లేదనీ దానికి చిత్తశుద్ధి లేదనీ 500 కోట్ల రూపాయలతో డంపింగ్ యార్డు కట్టే మనస్సు మీకు ఇక్కడి ప్రజలపై మీకు లేకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలోనే వీళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని నినందించారు. కాకినాడలోనే ఇళ్ళు పొందే విధంగా వీరందరికీ జనసేన పార్టీ హామీ ఇస్తోందని తెలియచేసారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాకినాడలోని ప్రతి పేదవాడికి కాకినాడలోనే ఇల్లు ఇస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సిటి జెనరల్ శెక్రటరీ సరగడ రమణారెడ్డి, సిటి సహాయ కార్యదర్శి దూడ తాతారావు, అల్లం గోవిందరావు, దొరబాబు, సత్తిబాబు, రాయుడు దుర్గ, సరిత, విజయ, మాధవి, సుజాత, నాగదేవి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.