ఇళ్ళ కోసం యుద్ధానికి మేము సిద్ధమే

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో స్థానిక 11వ డివిజన్ నూకాలమ్మ గుడి ప్రాంతంలో జంప అప్పల రమణ ఆధ్వర్యంలో మన నివాసానికి ఇళ్ళ కోసం యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ శాసనసభ్యులు ద్వారంపూడి స్థానిక 10, 11, 12 డివిజను ప్రజలను యు.కొత్తపల్లి తీసుకెళ్ళి ఇక్కడ లే-అవుటులో మీకు ఇళ్ళు ఇచ్చేసామని ఒక కార్యక్రమం చేసారు. కొమరిగిరి తీసుకెళ్ళి అక్కడ పట్టాలిచ్చానని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారనీ, 889 పట్టాలు నేను ఇచ్చాను అని చెప్పుకోడం సంతోషమనీ కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తించాలనీ నలభైవేల జనాభా ఇరవైవేల ఓటరులు ఉండగా కేవలం 889 మందికి మాత్రమే ఆయన పట్టాలు ఇవ్వడం జరిగిందని గమనించాలన్నారు. ఇది స్వయంగా ఆయన నోటితో చెప్పిన విషయాన్ని చెప్పారనీ ఇది కేవలం రెండుశాతమనీ పైగా మీఅందరికీ ఇళ్ళు కట్టుకోడానికి లోన్లు శాంక్షన్ చేయిస్తాననీ అన్నారు ఉన్న పదిరోజుల సమయంలో కాగితలమీద ఉన్న పట్టాలని నేలమీద చూపెట్టడానికే సరిపోదు ఈలోగా ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది కాలం సరిపోదు ఎందుకు ఈ శుష్కవాగ్ధానాలు అని ప్రశ్నించారు. అరవైనెలల అధికారాన్ని అనుభవించి ఎన్నికలు నెలరోజులు పెట్టుకుని ఇప్పుడు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ మాయమాటలు చెప్పడం ద్రోహం కాదా అన్నారు. ఇన్నాళ్ళు భూకబ్జాలు, దౌర్జన్యాలు జరుపుతూ ఉదాశీనంగా ఉండి ఇప్పుడు సుమారు ముప్పైవేలమందికి ఇళ్ళు ఇచ్చానని చెప్పడం కేవలం ఎన్నికల్లో లబ్దిపొందడానికి తప్ప చిత్తశుద్దిగా చేసినది కాదని దుయ్యబట్టారు. ఇక్కడ వారికి వన్ టైం సెట్టిల్మెంట్ అని చెప్పి పదివేల రూపాయలు కట్టించుకుని ఒరగబెట్టింది ఏమీలేదని తూర్పారబట్టారు. ఒకనాడు ఇక్కడే మా తండ్రిగారు ముత్తా గోపాలకృష్ణ రాజశేఖర్ రెడ్డి హయాములో కేవలం అయిదు సంవత్సరాలలోనే శంఖుస్థాపన చేసి ఇళ్ళు పూర్తిచేసి తాళాలు లబ్దిదారులకి ఇచ్చి గృహప్రవేశం చేయించడం జరిగిందనీ అదీ చిత్తశుద్ది అంటే అని హేళనచేసారు. ముప్పైవేల మంది కాకినాడ ప్రజలని నగరబహిస్ఖరణ చేపించారు, మీ నాయకులకి, మీ మనుషులకి మాత్రం నగరంలోనే ఇళ్ళుకేటాయించి కట్టి ఇస్తున్నారనీ దీన్నే ద్వంద్వ విధానం అంటారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి కిషొర్ కుమార్, చింతా గోపాలకృష్ణ, ప్రసాద్, డేవిడ్, కర్రి సత్యసాయి, వెంకటేష్, సతీష్, శ్రీకాంత్, పెమ్మాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.