మీడియాపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నాం: సోమురౌతు అనురాధ

వేమూరు: సిబిఐ విచారణకు వెళ్లాల్సిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి వాహనాన్ని అనుసరిస్తున్న మీడియా సిబ్బందిపై వైసీపీ గూండాలు దాడులకు పాల్పడటం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వేమూరు నియోజవర్గం జనసేన పార్టీ కార్యదర్శి సోమురౌతు అనురాధ అన్నారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, హెచ్ఎంటీవీలకు సంబంధించిన విలేకరులను ఇతర సిబ్బందిని గాయపరిచి వాహనాలను కెమెరాలు ధ్వంసం చేయటం చూస్తుంటే వైసీపీ గుండాలు బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. నగరంలో నడిరోడ్డుపై కడప ఎంపీ సంబందికుల వీరంగాన్ని తెలంగాణ ప్రజలు కళ్ళారా చూశారని, మీడియాపై చేసిన దాడి వైసిపిలో నెలకొన్న ఆందోళనను అసహనాన్ని సూచిస్తుంది. ఈ దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులను కోరుతున్నామని ఆమె అన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాస్తున్న కథనాలు వైసీపీకి కంటగింపుగా మారాయి. ఈ క్రమంలోనే భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఈనాడు యాజమాన్యంపై మార్గదర్శి పేరుతో వేధింపులకు పాల్పడుతుంది, వైసీపీ ప్రభుత్వం దాడులు వేధింపులతో మీడియాను కట్టడం చేయాలని చూడటం ప్రమాదకరం. ప్రజాస్వామ్యవాదులు ఈ చర్యలను ఖండించాలని, బాధితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.