మదమెక్కి మాట్లాడిన జోగి రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: కుంటిమద్ది

అనంతపురం: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సోమవారం అమరావతి బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి మీరు అధికార మదమెక్కి మాట్లాడిన తప్పుడు మాటలని తీవ్రంగా ఖండిస్తున్నామని. మీ మాటలు వింటూ బహిరంగ సభలో పైశాచిక ఆనందం పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రవర్తన తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జోగి రమేష్ మీరు కడుపుకు అన్నం తినే వ్యక్తులైతే మీ శాఖకు సంబంధించి, పురోగతిని రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి? గతంలో మీరు, మీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు 30 లక్షల ఇల్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పారు?. కాలనీలు కాదు ఊర్లు నిర్మిస్తున్నాం అని డప్పులు కొట్టారు?. ఇంతవరకు లబ్ధిదారులకు ఎన్ని ఊర్లు నిర్మించి ఇచ్చారు?. లబ్ధిదారుకు ఎన్ని గృహాలు నిర్మించి అందజేశారు? మీకు చేతనైతే దమ్ము ధైరం ఉంటే సమీక్ష జరిపి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేవలం మీకు మంత్రి పదవులు ఇచ్చింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత విమర్శలు చేయడానికా? రాష్ట్ర ప్రజల బాబోగులు మీకు పట్టవా? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శిస్తాం? కేసులు పెడతామంటే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం?.. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీరమైపోయాయ్? ప్రభుత్వంపైన రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. మీకు చాతనైతే దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నిరవర్తించండి. ప్రజా సంపదని, పకృతి ఒనరుల్ని దోచుకుంటాం అంటే రాష్ట్ర ప్రజల హర్షించరు. మీ ముఖ్యమంత్రి ప్రజలకు కనపడకుండా పరదాల చాటున దాక్కొని వెళ్లడానికి మీ పైశాచికానందానికి చెట్లను కూడా నరికేస్తున్నారు? ఇప్పటికైనా కండకావరం తగ్గించుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారని ఆశిస్తున్నామని జయరాం రెడ్డి పేర్కొన్నారు.