విద్యార్థుల మరణాలు ప్రభుత్వ పరోక్ష హత్యాకాండగా భావిస్తున్నాం: కిల్లో రాజన్

పాడేరు, గిరిజన సంక్షేమ ఆశ్రమాలలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రూరల్ జిల్లా జనసేన పార్టీ,జాయింట్ సెక్రెటరీ కిల్లో. రాజన్ అన్నారు. గత ఏడాది నుండి నేటి వరకు 40 మంది విద్యార్థుల వరకు చనిపోయారు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యమాలు నిర్వహించినప్పటకి వైసీపీ సర్కార్ కి చిమకుట్టి నంత చలనం లేదు, దీనిని బట్టి చూస్తే, ఆదివాసి గిరిజన పిల్లల మీద వైసీపీ నాయకులకు, ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది, మా ఆదివాసి పిల్లల ప్రణాల మీద ఎంత బాధ్యత రహితంగా, వ్యవహరిస్తున్నారో తేటతెల్లమవుతుంది, విద్యార్థుల కోసం ఉద్యమిస్తున్న నాయకులను, ఆంక్షలు విధించి, అరెస్ట్ లు చేయడం అప్రజాస్వామ్యం. ఇప్పటికైనా విద్యార్థి మరణాలు అరికట్టేలా హాస్టల్స్ లో హెల్త్ అసిస్టెంట్లును గతంలో మాదిరిగా నియమించాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోని తక్షణమే, పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించి ఆదుకోవాలని, తమ బాధ్యతను, చిత్తశుద్ధితో నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమాలలో పౌష్టికాహారం లోపం వలన మెరుగైన మెనూ సక్రమంగా అమలు కాకపోవటం వలన రక్తతిహీనతతో మరియు కడుపునొప్పులతో, విషజ్వరాలతో పెద్ద ఎత్తున విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. విద్యార్థి సమస్యల పరిష్కార దిశగా అధికారులు ఆలోచన చేయడంలో విఫలం చెందారని ఆరోపించారు, మరణాలకు గల కారణాలను,గుర్తించి మళ్ళీ పునరావృత్తఒ కాకుండా చూడాలి, నిర్లక్ష్యంగా వేవహరించిన వారిపై కటిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేస్తూ. మరణించిన విద్యార్థుల తలి దండ్రులకు ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ విద్యార్ధులు అభ్యునతికోసం పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకులకు, విద్యార్థి సంఘాలకు, జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.