దళిత, రజక కుటుంబాలకు అండగా ఉంటాం

  • జనసేన పార్టీ నాయకుడు యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట నియోజకవర్గం: టీ సుండుపల్లి మండలం, రాయవరం మిట్టమీద పల్లిలో దళిత కుటుంబాలకు వెళ్లే పురాతన దారితో సహా కబ్జా చేసి అడ్డంగా గోడ కట్టిన విషయం అందరికి తెలిసిందే. జనసేన పార్టీ రాజంపేట నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజుతో పాటు మచ్చ లక్ష్మి నారాయణ మిట్టమీద పల్లెను శుక్రవారం సందర్శించి పురాతన దారికి అడ్డంగా గోడ కట్టి ఖాళీ స్థలం కబ్జా చేయడం దారుణం అని కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. జరిగిన విషయాలపై గ్రామస్తులతో చర్చించారు. అధికారులు వెంటనే యధా విధిగా పురాతన దారికి అడ్డంగా కట్టిన గోడను తొలగించాలని లేకుంటే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుంటిమడుగు శ్రీనివాసులు రాజు, రాజంపేట నాయకులు శింగంశెట్టి నరేంద్ర, నాసర్ ఖాన్, ఆకుల చలపతి, వంటేరు రాజా, సలీం, సుగుణమ్మ, స్థానికులు పాముల గోపాలయ్య, నరిసింహులు, బాధిత కుటుంబ సభ్యులునీరుగుట్టు నగేష్, పెద్దవీటి శివ, పెద్దవీటి లక్ష్మీదేవి, పెద్ధవీటి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.