భుములకోసం మా హక్కు పొందేవరకు పోరాటం చేస్తాము: చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి

హుస్నాబాద్: భుములకోసం మా హక్కు పొందేవరకు న్యాయబద్ధమైన పోరాటం చేస్తామని హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన కో ఆర్డినేటర్ చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమూహాన్ని చెదరగొట్టి, విజయం సాధించారని విర్రవీగకు. ఈ సమూహంను దెబ్బ తియ్యోచ్చు కాని మరల సమూహం ఒక్కదగ్గర చేరడానికి 30 రోజుల వ్యవధి పడుతుంది. కుటుంబాలను దరి చేర్చి మళ్ళీ అవే భుములకోసం మా హక్కు పొందేవరకు న్యాయబద్ధమైన పోరాటం చేస్తాము.. అంత వరకు గెలిచాం అనుకొని సంబురాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ కోర్టు ఉత్తర్వులు మీ ఇంటి గడపకు చేర్చుతాం. న్యాయస్థానాల ఉత్తర్వులను బెకాతరు చేసిన ప్రభుత్వంకు మేము కూడా ఈ రాష్ట్ర పౌరులమే అని గుర్తుచేస్తూ మా హక్కును వీధి పోరాటం చేసి ఐనా మా హక్కులు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటాం. రైతాంగ సాయుధ పోరాటాన్ని మళ్ళీ చేసే రోజులు వచ్చాయేమో.. ప్రభుత్వం 86 అక్కళ భూమిని రైతుల దగ్గర చవకగా తీసుకొని వారికి సరైన పరిహారం ఇవ్వకుండా వారికి సరైన దారి చూపకుండా రోడ్డున పడేసి చోద్యం చూస్తూ వున్న తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు… రైతును ప్రతి చోట దగా చేస్తూ పబ్బం గడుకుంటున్న దళారీ వ్యవస్థ, మనకు కాదులే అని చూసి చూడనట్టు వున్న ప్రజలు. ఏ కష్టం మన దాకా రాలేదు అనుకోకండి ఈ రోజు రైతుకు, రేపు మీకు అంతే.. త్వరలో జనసేన పార్టీ ముఖ్య నాయకులకు తెలిపి ప్రజా సంఘాల మరియు యువత తో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసి మోసపోయిన ప్రతి రైతు కోసం పోరాటం చేసి వారి హక్కులు పొందేవరకు వారికి తోడుగా ఉంటాము అని మాట ఇస్తున్నామని చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.