పాకాల నుండి దామలచెరువు రోడ్డు పడే వరకు పోరాడతాం: జనసేన

దామాలచెరువు నుండి పాకాల రోడ్డు గత 20 సంవత్సరాలుగా దీన స్థితిలో ఉంది ఇందుకు గాను ప్రజల శ్రేయస్సు కోసం జనసేన నాయకులు, వీర మహిళలు శాంతియుత నిరసన నిర్వహిస్తుంటే.. శ్రీమతి ఆకెపతి శుభాషిని, మనోహర్, నాసీర్, ఆశా, నౌమూన్ లను వైసీపీ నాయకులు దూషిస్తూ.. మీ అంతు చూస్తాం అని బెదిరించడం వైసీపీ పాలనకు అద్దం పడుతుంది.. మీకు దమ్ము దైర్యం ఉంటే ఈ పౌరుషం ప్రజా సమస్యలపైన చూపించండి అంటూ.. జనసేన నాయకులు సవాల్ విసిరి.. ప్రజాసమస్యల పరిష్కార దిశలో ఎవరికి బయపడం, ప్రజల కోసం బరించడానికి సంసిద్ధం.. పాకాల నుండి దామలచెరువు రోడ్డు పడే వరకు పోరాడుతాం అని తెలియజేసారు.