2024లో సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన జెండాను ఎగరవేస్తాం: బోనబోయిన

సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, అంచుల వారి పాలెం గ్రామంలో జనసేన పార్టీ జెండావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ , జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావులను అనుపాలెం గ్రామం నుంచి అంచులూరిపాలెం గ్రామం వరకు బైక్ ర్యాలీతో వీరమహిళలు హారతులతో పూల వర్షంతో అంగరంగ ఆహ్వానించడం జరిగింది. కార్యక్రమంలో ముందుగా గ్రామంలోని శ్రీ అమరలింగేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి అనంతరం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ముఖ్య అతిథులు శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఇదే అంచుల వారి పాలెం గ్రామంలో 95% ఓట్లు పోలయ్యాయి, రానున్న ఎన్నికల్లో 100% ఓట్లు జనసేన పార్టీకి పడేలాగా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. మేము గ్రామానికి వస్తుంటే మాలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని మాకు పూలవర్షం కురిపిస్తూ హారతులతో స్వాగతం పలుకు పలికిన గ్రామంలో ఉన్న ప్రతి మహిళకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది అని, పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా వస్తేనే న్యాయం జరుగుతుందని, 2009లో అంచులవారి పాలెం గ్రామంలో ప్రజారాజ్యం పార్టీకి ఎలా అయితే అండగా ఉన్నారో రానున్న 2024 ఎలక్షన్ లో కూడా జనసేన పార్టీ అంతే అండగా ఉండాలని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన గ్రామాలు కూడా జనసేన పార్టీకి బలంగా నిలబడాలని కోరుకుంటున్నాను. మేము గ్రామంలోకి వస్తుంటే మమ్మల్ని ఎంత అపురూపంగా గ్రామంలోకి తీసుకొని వచ్చిన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా వీరమహిళలందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ జెండా ఆవిష్కరణ జరుగుటకు కృషిచేసిన తోట నాగేశ్వరరావు, గలబా నాగేశ్వరరావు, జనసేన సుబ్బారావు, అంచుల వాసు, అంచుల అనీష్, తోట శివరాం, అంచుల వెంకీ గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు అందరిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శి ఎర్రంశెట్టి రామకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శిలు సిరిగిరి శ్రీనివాసరావు, కాసిం సైదా, దమ్మాలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, వల్లెం శ్రీనివాసరావు, సిరిగిరి మణికంఠ, గ్రామ అధ్యక్షులు వెంకటకృష్ణ, రుద్ర జడ శివయ్య, తిరుమల శెట్టి గోపి, నకరికల్లు ఉపాధ్యక్షులు నాగూర్ వలి,రాజుపాలెం మండల ప్రధాన కార్యదర్శి కేదార రమేష్, సత్తెనపల్లి రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి అంచుల రామాంజనేయులు, మధులాల్, గ్రంధి సదాశివరావు, బాదినీడు సుబ్బారావు, సైదారావు మరియు అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.