ప్రతి వాడ, వాడలో జనసేన జెండా ఎగరవేస్తాం: గాదె

గురజాల నియోజవర్గం పల్లెగుంత గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన జనసేన జెండా దిమ్మని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి వాడ, వాడలో జనసేన జెండా ఎగరవేస్తామని అలాగే ప్రతి కార్యకర్తను నాయకులను కలుపుకుంటూ జనసేన పార్టీ రోజురోజుకీ బలం చేకూర్చేలా అందరిని ఏకతాటిపై తీసుకువచ్చి భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలో తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు. భవిష్యత్తు రాజకీయంలో కీలకపాత్ర పోషించేది జనసేన పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.