ముస్లింలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

  • కులమతరహిత రాజకీయాలే జనసేన సిద్దాంతం
  • ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ముస్లింలను నమ్మించి మోసం చేసిన జగన్
  • ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ఎలాంటి త్యాగాలకైనా జనసేన సిద్ధం
  • ముస్లింల జీవనప్రమాణాలను మెరుగుపరిచేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక
  • పవన్ భయ్యా మీతోనే మేము పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి.

గుంటురు, జనసేన పార్టీ మూల సిద్దాంతాల్లోనే కులాలను కలిపే ప్రణాళిక, మతరహిత రాజకీయ ప్రస్తావన ఉందని, ముస్లిం సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ముస్లిం సమాజం జనసేన వెంట నడిచేందుకు సమాయత్తం అవుతుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. పార్టీ 22 వ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీనివాసరావుతోటలోని పీర్లచావిడి సెంట్లరో పవన్ భయ్యా మీతోనే మేము గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి రాజకీయ నేతలు ప్రజలను కులాల వారిగా మతాల వారిగా విడగొట్టి వారిమధ్య కులమత కుంపట్లు రాజేసి తమ రాజకీయ చలి కాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కులాలను కలిపే విధంగా మతరహిత రాజకీయ వ్యవస్థ స్థాపనే లక్ష్యంగా కృషి చేయటం పట్ల యావత్ ప్రజానీకం హర్షం వ్యక్తం చేయటం ఎంతో ముదావహం అన్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసా మేరకు ముస్లింల భద్రతకు , సంక్షేమానికి ఎవరు హాని తలపెట్టినా ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు. వసుధైక కుటుంబాలకు నిలయమైన భారతదేశంలో ప్రజలందరూ అన్నదమ్ముల్లా కలిసుండాలని జనసేన ఆకాంక్షిస్తుందన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవటం వారిని నమ్మించి దగా చేయటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు తమను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న రాజకీయ పార్టీల తీరుపై ముస్లిం సమాజం తీవ్ర అగ్రహావేశంతో ఉందని అదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఉన్నతాశయాల మీద నీతినిజాయితీ, నిబద్ధత పట్ల నమ్మకంతో ఏకపక్షంగా జనసేనకు మద్దతు తెలుపుతుండటం రాష్ట్రానికి శుభపరిణామమన్నారు. ముస్లింల జీవన ప్రమాణాలపై పవన్ కళ్యాణ్ సమగ్ర నివేదిక తెప్పించుకుంటున్నారన్నారు. ముస్లిం మైనారిటీలు అన్ని విధాలా అభివృద్ధి సాధించేలా పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆళ్ళ హరి తెలిపారు. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా ఆళ్ళ హరి శుభాకాంక్షలు అందచేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శిలు మెహబూబ్ బాషా, బండారు రవీంద్ర, ఏడవ డివిజన్ అధ్యక్షుడు రజాక్, సయ్యద్ రఫీ, మొహమ్మద్ యూసఫ్, షేక్ నాగూర్, మదార్, నాగూర్ బాబు, రామిశెట్టి శ్రీనివాసరావు, శెట్టి శ్రీను, రాష్ట్ర రెల్లి నాయకులు సోమి ఉదయ్, బల్లాల హేమంత్, బద్రిశెట్టి కుమారస్వామి, భలే ప్రభాకరరావు, అలా గోవింద్, నండూరి స్వామి తదితరులు పాల్గొన్నారు.