నాగబాబు ఆదేశాల మేరకు పనిచేస్తాం: దారం అనిత

  • నాగబాబుకు స్వాగతం పలకడానికి వెళ్ళిన మదనపల్లి జనసేన నాయకులు

మదనపల్లి నియోజకవర్గం: స్థానిక మిషన్ కాంపౌండ్ లో శనివారం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు విచ్చేస్తున్న సందర్భంగా మదనపల్లి నుండి భారీ ఎత్తున మదనపల్లి జనసేన నాయకులు బయలుదేరారు.. ఈ సందర్భంగా శ్రీరామ రామాంజనేయులు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మాట్లాడుతూ మొదటిసారి ప్రధాన కార్యదర్శి ఒక మంచి దిశా నిర్దేశం నాగబాబుగారు చేయనున్నారని ఆయన సూచించిన మేరకు నియోజకవర్గంలో పనిచేయడానికి ప్రతి ఒక్క నాయకులు కట్టుబడి ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా తిరుపతికి బయలుదేరిన మదనపల్లి జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు వీరమహిళలు.