సోహెల్ హీరోగా వెబ్ సీరిస్!

బిగ్ బాస్ సీజన్ 4లో అందరి మనసులూ గెలుచుకున్న సోహెల్ హీరోగా బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సింగరేణి ముద్దు బిడ్డ హీరోగా ‘జార్జిరెడ్డి’ నిర్మాత అప్పిరెడ్డితో ఓ సినిమాను చేస్తున్నాడు. వి. శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తన సినిమాలో మెగాస్టార్ చిన్న పాత్రలో కనిపిస్తా అని ప్రామిస్ కూడా చేశారు.

తాజాగా నిర్మాత, నటుడు అచ్యుత రామారావు సైతం సోహెల్ తో ఓ మూవీని ప్లాన్ చేశారు. దీనికంటే ముందు ఆయన సోహెల్ తో ఓ హిందీ వెబ్ సీరిస్ తీయబోతున్నారు. సంజయ్ మిశ్రా కీలకపాత్ర పోషించబోతున్న ఈ వెబ్ సీరిస్ ను వర్మ డైరెక్ట్ చేయబోతున్నాడు. మూడు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ వెబ్ సీరిస్ ను అతి త్వరలో ప్రారంభించబోతున్నారు. దీనికి ‘మై హూ షోలే’ అనే పేరు ఖరారు చేశారు.