ఇరిగెల రాంపుల్లారెడ్డికి ఘన స్వాగతం

  • శిరివెళ్ళకు విచ్చేసిన జనసేన పార్టీ నేత ఇరిగెల రాంపుల్లా రెడ్డి మరియు ఇరిగెల బ్రదర్స్ కు అనూహ్య స్పందన
  • 100 కార్లు 500 బైక్ లతో భారీ ర్యాలీతో ఎదురేగి పూలవర్షం కురిపించిన శిరివెళ్ల జనసైనికులు

ఆళ్లగడ్డ, శిరివెళ్ల, ప్రముఖ సీనియర్ రాజకీయ నేత ఆళ్లగడ్డ అసెంబ్లీ ముద్దుబిడ్డ నియోజకవర్గ అభిమాన నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి మరియు ఆయన సోదరులు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన అనంతరం మొట్టమొదటిసారిగా శిరివెళ్లకు చేరుకున్నారు. జనసేన పార్టీ జనసైనికులు యువకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి మరియు ఇరిగెల అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై బంతిపూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. 100 కార్లు 500 కు పైగా బైకులు వెయ్యి మందికి పైగా ప్రజలు ప్రజలు బంతిపూల వర్షం కురిపిస్తూ గులాబీ, సన్నజాజి మాలలు, వేస్తూ ఖరీదైన బొకేలు అందిస్తూ అభిమాన వర్షం కురిపించారు. శిరివెళ్ల మెట్ట ప్రాంతం జై జనసేన, జై ఇరిగేలా అంటూ ఉప్పొంగిన అభిమాన నినాదాలతో ప్రాంతం మారు మోగింది. 3 సంవత్సరాల అనంతరం జనసేన కండువా కప్పుకొని బహిరంగంగా ప్రత్యక్ష రాజకీయ అరనేటం చేసిన ఇరిగెల రాంపుల్లారెడ్డికి ప్రజల ప్రజల నుండి అభిమాన జల్లు కురిపించారు. శిరివెళ్ల మెట్ట జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు జన సైనికులు ఇరిగెల నినాదాలతో ర్యాలీతో కిక్కిరిసిపోయింది. ఇటీవల కాలంలో స్థానికంగా ఏ నాయకుడికి లభించని అభిమానం ఇరిగెల రాంపుల్లారెడ్డికి ఊహించని అనూహ్యంగా లభించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హాజరైన జన సైనికులకు తన అభిమానులకు ఇరిగెల రాం పుల్లారెడ్డి అభివాదం చేస్తూ కరచారం అందిస్తూ చిరునవ్వుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రజల హర్షద్వానాలతో జేజేలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ మండల నాయకులు పెసరాయి చాంద్ భాష, లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాగిరెడ్డి మధుసూదన్ రావు, మాలి భాష పెద్ద బాలయ్య పసుల నరేంద్రుడు, కట్టెల ఇబ్రహీం, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.