కేటీఆర్ ఏపీకొస్తే ఏం చూపిస్తారు..?: దారం అనిత

*కేటీఆర్ ఏపీకొస్తే అంధకారంలో వున్న హాస్పిటల్ల్స్, పడుకుని వున్న పోలవరం చూపిస్తారా..?

*బాబాయిని చంపిన బాత్రూంని చూపిస్తారా లేక తాడేపల్లి చుట్టూ వేసిన పెన్సింగ్ చూపిస్తారా..?

*మీకు చేతనైతే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి చూపండి, మీరు తెచ్చిన అప్పులకు లెక్కలకు చూపండి

‎ప్రపంచంలోకెల్లా దుర్మార్గుడు ఎవరంటే.. దుశ్శాసనుడు అన్నట్టు.. దేశంలోకెల్లా చేతకాని పాలకుడు ఎవరంటే జగన్ రెడ్డి అని ప్రజలు చెప్పుకుంటున్నారు. జగన్ రెడ్డి చేతకాని పాలనతో రాష్ట్రం పరువుపోతోంది. తెలుగు జాతి అపహాస్యమవుతోంది. ఏపీలో కరెంట్, నీళ్లు, అభివృద్ది లేదని ఒక్క కేటీఆర్ మాత్రమే కాదు.. దేశంలోని మెజార్టీ ప్రజలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ వాస్తవాలు చెపితే సహించలేని వైసీపీ మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఏపీకొస్తే అభివృద్ది చూపిస్తామని నేతలు మంత్రి రోజా అనటం హాస్యాస్పదంగా ఉందని చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా దారం అనిత మాట్లాడుతూ.. కేటీఆర్ ఏపీకొస్తే వైసీపీ నేతలు ఏం చూపిస్తారని ఘాటుగా ప్రశ్నించారు..

రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో కరెంట్ లేక సెల్ ఫోన్ లైట్ వెలుతురులో వైద్యం చేయటం చూపిస్తారా?.. లేక 3 ఏళ్ల వైపీపీ పాలనలో దుర్మార్గుల చేతిలో అఘాయిత్యాలకు బలైన మహిళల ఫోటోలు చూపిస్తారా?.. లేక ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడ్డ నిరుద్యోగ యువత సమాధులు చూపిస్తారా?.. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం అందక బలవర్మణాలకు పాల్పడ్డ రైతన్నల కుటుంబాల కన్నీళ్లు చూపిస్తారా?.. లేక అమరావతి ప్రాంతంలో మొలిచిన పిచ్చి మెక్కల్ని చూపిస్తారా?.. జగన్ రెడ్డి కమీషన్లకు తట్టుకోలేక పొరుగు రాష్ట్రాలకు పారిపోయిన కంపెనీల లిస్ట్ చూపిస్తారా?.. కూల్చివేసిన ప్రజావేధికను చూపిస్తారా?.. గత ప్రభుత్వం హయాంలో 70 శాతం పూర్తయి..3 ఏళ్లలో కనీసం 7 శాతం కూడా పూర్తికాని పోలవరాన్ని చూపిస్తారా?.. రాజధాని పేరుతో విశాఖలో చేసిన భూ కబ్జాలు చూపిస్తారా?.. ద్వంసం చేసిన దేవాలయాల్ని చూపిస్తారా?.. లేక తగులబెట్టిన రధాలు చూపిస్తారా?.. లేక జగన్ రెడ్డి కొత్తగా తెచ్చిన నాసిరకం మద్యం బ్రాండ్లు చూపిస్తారా?.. వైసీపీ నేతలు చేస్తున్న అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా, గంజాయి మాఫియాను చూపిస్తారా?.. సినిమా ధియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వైసీపీ నేతల్ని చూపిస్తారా?.. కేటీఆర్ ఏపికొస్తే వీటిలో ఏం చూపిస్తారో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. మీకు చేతనైతే రాష్ట్రంలో తెచ్చిన అప్పులకు లెక్కలకు చూపండని దారం అనిత ప్రశ్నించారు..