కటౌట్ కే భయపడితే ఎలా..?

  • కటౌట్ ఉన్నోడికి కంటెంట్ చాలు

సర్వేపల్లి, వెంకటాచల మండలం, సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి కొన్ని దుష్ట శక్తులు కావాలని జనసేన పార్టీ ఫ్లెక్సీలను చించేయడం జరిగింది. ఈ విషయంపై వెంకటాచలం సర్కిల్ సీఐ గంగాధర్ కి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, జనసేన పార్టీ జిల్లా నాయకులతో కలిసి వెళ్లి వెంకటాచలం పోలీస్ స్టేషన్ నందు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి పాల్పడిన దుష్ట శక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, సిఐని కోరడం జరిగింది. పూర్తిస్థాయిలో విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాకు సిఐ హామీ ఇవ్వడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఫ్లెక్సీలు అయితే చించగలరు కానీ ప్రజల గుండెల్లో మా అధినేత చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన వేసే ప్రతి అడుగు ప్రజలు గమనిస్తున్నారు. ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మీరు కటౌట్ లు అయితే చించగలరు కాని వాళ్ల గుండెల్లో ఉండే అభిమానం టన్నుల్లో ఉంది. మరి దానిని చెరపలేరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులు హరి రెడ్డి, గూడూరు చిరంజీవి యువత అధ్యక్షులు ఎస్.కె నహీమ్, రహీం, కాకి శివకుమార్, శ్రీహరి, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.