నీకో చట్టం నాకో చట్టం కాదు..పవన్ కళ్యాణ్ తప్పుచేసినా తల తీసే చట్టం రావాలి

పసిబిడ్డల నుంచి ముసలమ్మలదాకా స్త్రీ మానప్రాణాలకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, రోడ్లు, రైళ్లు, ఆఫీసుల్లో ఎక్కడా భద్రత లేకుండాపోయింది..గొంతుక పిసికి, బ్లేడుతో చీల్చి, కత్తితో కోసి, గొడ్డలితో నరికి, చున్నీతో ఊరేసి, యాసిడ్ గుమ్మరించి, పెట్రోల్ చల్లి తగలబెట్టి జీవించే హక్కునే హరించివేస్తున్నారు. అత్యాచారం జరిగినప్పుడు కొద్దీ రోజులు సంచలన వార్తగా ఉండి, మరొకొద్ది రోజులకు పాతబడి అందరూ మరచిపోయే సంఘటనగా మాత్రమే ఈ పైశాచిక పని ఎందుకు మిగిలిపోతోంది? అంతకుమించి ఎందుకు సమాజం బలమైన స్థాయిలో స్పందించడం లేదు? మనలో సంస్కృతి, విలువల పతనం ఒక కారణమైతే, మీడియా ప్రసారాలు డబ్బు, సెక్స్ ని గ్లామర్ గా చూపించండం మరో కారణం..ఎంత పెద్ద నేరం చేసినా తప్పించుకోవడం తేలిక.. అధికార దుర్వినియోగం మన దేశంలో ఎక్కువే.. రక్షణగా నిలబడాల్సిన వ్యవస్థలు దుర్మార్గంగా నిందితులను కాపుకాస్తాయనే భరోసా ఇస్తునప్పుడు నేరస్థులు తప్పు చేసిన వారిలాగా సిగ్గుపడట్లేదు. కఠినాతి కఠిన శిక్షలు పడాలని ప్రజల నుంచి డిమాండ్ కూడా వస్తోంది. ప్రస్తుత చట్టాలు నెరస్థుల్లో భయం కలిగించడంలో విఫలం అయ్యాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నట్లు చట్టాలు బలవన్తులకు బలహీనంగా బలహీనుల మీద బలంగా పనిచేస్తున్నాయి. ఇంకా ఆయన “నీకో చట్టం నాకో చట్టం కాదు.. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలతీసే చట్టం రావాలి అంటారు. రిపీటెడ్ గా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా సింగపూర్ లో అమలు చేస్తున్న కేనింగ్ పనిష్మెంట్ అమలు చేయాలి అని ఒక ఆలోచన కూడా చేశారు. ఎన్ కౌంటర్, ఉరిశిక్ష వల్ల ఆశించిన ఫలితం లేదు. భయం కూడా లేదు. నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పౌర సమాజం కూడా ఎన్ కౌంటర్, ఉరిశిక్షలను అంగీకరించదు. దుబాయ్, స్విజ్జర్లాండ్ లాంటి దేశాల్లో అమలు చేస్తున్న చట్టాలు మన దేశంలో కూడా రావాలి. ఆ నేరం చేసిన మగవాడు “జీవచ్చవం”లా బతికేలా శిక్షిస్తేనే మరో మగవాడు ఆ ఆలోచన చేయడానికి భయపడతాడు. ప్రస్తుతం ఉన్న చట్టం, శిక్ష అమలులో జాప్యం వల్ల భయం కల్పించలేక నేరాల్ని అపలేకపోతోందనేది స్పష్టం అవుతోంది. సింగపూర్, స్విజ్జర్లాండ్, దుబాయి మరికొన్ని దేశాల్లో లైంగిక నేరానికి పాల్పడితే కేనింగ్ పనిష్మెంట్ అమలుచేస్తున్నారు. కొన్ని దేశాల్లో మిలటరీలో కూడా తీవ్రమైన పనిష్మెంట్ గా కేనింగ్ అమలుచేస్తున్నారు. ప్రపంచంలో చాలా దేశాలు తమ విద్యార్థులు క్రమశిక్షణ తప్పినప్పుడు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను బెత్తం దెబ్బలు కొడుతూవుంటారు. అది ఫలితం ఇస్తోంది. కేనింగ్ పనిష్మెంట్ బహిరంగ ప్రదేశాల్లో అమలు చేస్తారు. ఆ దెబ్బలకు జీవచ్చవంలా బతుకుతారు. సమాజంలో భయం ఏర్పడుతుంది. లైంగిక దాడి చేయాలనే ఆలోచన చేయటానికే సాహసించరు ఇటువంటి కఠిన శిక్షలు అమలు చేయగలిగితే. ఇది ఒక పరిష్కారం కాగలదని నా నమ్మకం. స్త్రీ ని గౌరవించే భారతదేశంలో భయం లేకుండా నిత్యం జరుగుతున్న ఈ అఘాయిత్యాలకు ముగింపు పలకాలంటే జీవచ్చవంలా బతికే శిక్షలు బహిరంగంగా అమలు చేయాల్సిందే. ఒక పరిష్కారం మేధావులు అన్వేషించాలి.

గోపాలకృష్ణ,
రాజేంద్రనగర్ నియోజకవర్గం.