3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆళ్ళనాని చేసిన అభివృద్ధి ఏంటి?

ఏలూరు,గత 3 సంవత్సరాల కాలంలో ఏలూరు నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి శూన్యం. ఒక ప్రక్కన వర్షాలతో రోడ్లు జలమయం అవుతుంటే మరో ప్రక్కన శిధిలావస్థలో ఉన్న రహదారులను చూస్తుంటే వాహనదారులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవన్నీ తెలిసి కూడా కళ్ళు ఉండి గుడ్డి వాడిలాగా ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళనాని పరిపాలన సాగిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు ఏలూరులో ఎన్నో పరిశ్రమలు రాబట్టాల్సింది పోయి ఉన్న ఒక్క జూట్ మిల్లును కూడా మూత పడేలా చేశారు. మీకు ఓటు వేసినందుకు ఏలూరు ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఫిల్ హౌస్ పేటలో శనివారం నాడు రహదారుల నిమిత్తం ఆందోళన చేసిన అనంతరమే హుటాహుటిన కంటి తుడుపు చర్యగా తాత్కాలిక మరమ్మత్తుల పని చేశారు. రాత్రి కురిసిన వర్షానికి మరలా యధావిధంగా ఆ ప్రాంతంలో ఉన్న రోడ్లు తయారయ్యాయి. 526 కోట్ల రూపాయల పెట్టి ఏలూరు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ పెట్టి కట్టిస్తామని 30 ఎకరాల భూసేకరణ చేస్తున్నామని శంకుస్థాపనలు చేసి పాత బస్టాండ్ డిఎమ్ఎచ్ ఆఫీస్ వద్ద ఉన్న ప్రభుత్వ ఒక ఎకరం భూమిలో హాస్పిటల్ నిర్మాణం చేయించడం దానికి అట్టహాసంగా నిర్మాణం చేయిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి సమీక్ష సమావేశం నిర్వహించడం మీకు మాత్రమే చెల్లిందని రెడ్డి అప్పల నాయుడు మండిపడ్డారు. ఏలూరులో అనేక ప్రాంతాల్లో గోతులు దర్శనమిస్తున్నాయి. రోడ్డును కూడా మరమ్మత్తు చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. వెంటనే ఈ రోడ్లకు మరమ్మతులు చేయించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా అమరావతిని ఉంచాలని అక్కడ ఉన్న రైతులు అనేక రకాల పోరాటాలు చేస్తుంటే వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడానికి మీ పార్టీకి సంబంధించిన కొంతమంది అమరావతి రైతుల ఉద్యమాన్ని చెడగొట్టడానికి ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రక్రియగా దొంగ జేఏసీ ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని మీకు నిజంగా దమ్ము ఉంటే 3 రాజధానులపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజా క్షేత్రంలో అమరావతిని రెఫరెండంగా చూపించి ఎన్నికలకు వెళ్ళే దమ్ము మీకు ఉందా అని అప్పల నాయుడు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ మంత్రికైనా పదవి పోకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్న మంత్రి రోజా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏలూరు జనసేన పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా రోజా మీ నోరు అదుపులో పెట్టుకోపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురవుతారని రెడ్డి అప్పల నాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి తదితరులు పాల్గొన్నారు.