అంబటి గారూ.. మీరు హద్దు దాటి ప్రవర్తిస్తే మేము కూడా హద్దు మీరాల్సి ఉంటుంది: గాదె

సత్తెనపల్లి నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యత వహిస్తున్న అంబటి రాంబాబు గారు ఆయన శాఖ మంత్రి దృష్టి పెట్టకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి యాత్రపై నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈమధ్య తలకి రంగు వేసుకోవడం మానేసి తెల్ల జుట్టుతో తిరుగుతున్న అంబటి రాంబాబు గారికి ఎంతోకొంత బుద్ధి మారుతుందని, పెద్దమనిషి తరహాలో వ్యవహరిస్తారని అందరం భావించాం. అయినప్పటికీ ఆయన ప్రవర్తన ఎలాంటి మార్పు లేకపోగా ఇంకా బుద్ధి లేకుండా తయారవుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఇంతకుముందు ఎవరికో పిచ్చోడికి ఇచ్చారు, తర్వాత అంబటి రాంబాబు గారికి ఇచ్చాక ఎంతో కొంత అనుభవం ఉన్న వ్యక్తి అని ఇరిగేషన్ మీద శ్రద్ధ వహిస్తారని అందరం భావించాం. కానీ అలాంటిదేమీ లేకుండా వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకూ పంట కాలువ నుండి గంపెడు మట్టి కూడా తీయకపోవడం ఇది చేతగాని తన నిదర్శనమని ఎద్దేవా చేశారు. అలాగే జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు తమ పార్టీ ప్రస్థానాన్ని తమకు నచ్చిన విధంగా కొనసాగిస్తున్నాయని, మధ్యలో అంబటి రాంబాబు గారికి వచ్చిన బాధ ఏంటని హెచ్చరించారు. మా ప్రచారానికి మాకు నచ్చిన పేరు పెట్టుకుంటాం ఆ పేరు విషయంలో కూడా అంబటి రాంబాబు గారు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. అలాగే అంబటి రాంబాబు గారిని నిలువరించడం జనసైనికులకు పెద్ద పని కాదని, జనసైనికులకు ఉన్న సంస్కారంతోనే అంబటి రాంబాబు గారు రోడ్లమీద తిరగ కలుగుతున్నారని, లేదంటే ఎప్పుడో రోడ్లు మీద నిలవరించే వాళ్ళమని తెలియజేశారు. ఇప్పటికైనా అంబటి రాంబాబు గారు హద్దుల్లో ఉండే ప్రవర్తిస్తే మంచిదని, అలాకాని పక్షంలో జనసైనికులు కూడా హద్దు మీరి ప్రవర్తించాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలో చేరిన ఒక నాయకుడు జనసైనికులను ప్రలోభ పెడుతున్నారని అది మంచి పద్ధతి కాదని తెలియజేశారు. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో పోటీ చేసేది జనసేన పార్టీ అని, పొత్తులపై తుది నిర్ణయం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని, అప్పటివరకు జన సైనికులు యధావిధిగా అంతకు ముందు లాగానే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శలు శిరిగిరి శ్రీనివాసరావు, తిరుమల శెట్టి మల్లేశ్వరి చట్టాల త్రినాథ్, పట్టణ నాయకులు వల్లెపు శ్రీనివాసరావు, పసుపులేటి వెంకటస్వామి, అల్లం శెట్టి వెంకటేశ్వర్లు, రాజుపాలెం మండల ఉపాధ్యక్షులు అంచుల అనేష్, నకరికల్లు ఉపాధ్యక్షులు నాగూర్ వలి, శిరిగిరి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.