గుంతల రోడ్డుపై ఆంధ్ర ప్రదేశ్ ప్రయాణం ఎటు??

  • పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసు ఆదేశానుసారం జనసేననాయకులు, జనసైనికుల గుంతల రోడ్డుపై ఆంద్రప్రదేశ్ ప్రయాణం ఎటు అనే నినాదంతో ర్యాలీ

పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామపార్టీ అధ్యక్షులు వెలుగుల లక్ష్మణ్ అధ్యక్షతన, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, గొల్లప్రోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు అమరాధి వల్లి రామకృష్ణ ముఖ్య అతిధులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు దుర్గాడ గ్రామంలో గల ఆటోస్టాండ్ నుండి హైస్కూల్ వరకు ర్యాలీని నిర్వహిస్తూ మధ్యలో రోడ్డుపై పడిన గుంతల వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జ్యోతులు శ్రీనివాసు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం పేరుతో అనేక రకాల పథకాలను అమలు చేస్తూ భారీస్థాయిలో కుంభకోణానికి పాల్పడుతూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో గల రోడ్లను పునర్ నిర్మించకుండా, గోతులను సైతం పూడ్చకుండా నిరంకుశ పాలనను కొనసాగిస్తుందని, దీనికి కారణంగా రోడ్లుసక్రమంగా లేకపోవడం వల్ల వాహన సోధకులు అనే ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లు సక్రమంగా లేకపోవడం వల్ల రోజుకి కొన్ని వేల స్థాయిలో రోడ్డు యాక్సిడెంట్లు జరిగి అనేకమంది మరణిస్తూ, గాయపడుతూ ఉన్నారని కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కైయిన కళ్ళు తెరిచి కనీసం రోడ్డుపైన గుంతలు నైనా పూడ్చాలని ఆయన వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు 2024 ఎన్నికలలో సంయుక్తంగా ముందుకెళ్ళి వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఓడించి, రాష్ట్రంలో సంక్షేమపరిపాలన చేసే దిశగా వెళ్తున్నాయని కాబట్టి ప్రతిఒక్కరు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు తగు సహాయ సహకారాలు అందించి జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షులు అమరాధి వల్లీరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై కనీస బడ్జెట్ను కూడా పెట్టకుండా నిరంకుశ పాలన కొనసాగిస్తుందని, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇంటి వీరబాబు గొల్లపల్లి శివ గొల్లపల్లి గంగా ఈశ్వరుడు, మేడిబోయిన సత్యనారాయణ, శాఖ సురేష్, జ్యోతుల శివశంకర్, మంతెనగణేష్, ఉమ్మడి దొరబాబు, మేడిబోయిన గోపికృష్ణ, పొలంత్రిమూర్తులు, కొటికలపూడి గంగాధర్, జ్యోతుల గోపి, సాధన స్వామి, జగ్గారపు కృష్ణ విజయ ప్రసాద్, జ్యోతుల చిన్నయ్య, ఆకుల వెంకట సాయి, చక్రధర్, కీర్తి చిన్న, కోలా నాని, దడాల రాజుబాబు, విప్పర్తి శ్రీను, శివకోటి రమణ, దుళ్ల శివగంగ, మునగపాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.