కప్పలదొడ్డి ఇసుక దొంగలు ఎవరు?

పెడన నియోజకవర్గం గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో యదేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతుంది. ప్రతిరోజు వందలకొద్దీ టిప్పర్లతో ఇసుక అక్రమంగా తిసుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ సిబ్బంది అ చుట్టుపక్కలకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ అండదండలతోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది అనేది బహిరంగ రహస్యం. మైనింగ్ చేస్తున్న భూమి ప్రభుత్వ భూమి. స్థానిక ఎస్సీలకు ప్రభుత్వం గతంలో బి ఫారం పట్టాలు ఇవ్వడం జరిగింది. భూమిని సాగు చేసుకునే హక్కే తప్ప అమ్ముకునే హక్కు లేదు. కానీ మొదటిగా కప్పలదొడ్డి వార్డు నెంబరు దగ్గర్నుండి అర ఎకరం భూమి కొనుగోలు చేసి మైనింగ్ ప్రారంభించి, పక్కన ఉన్న అమాయకపు రైతులను నయానో, భయానో వారి దారిలోకి తెచ్చుకొని ఆ భూమిని కూడా స్వాధీనపరచుకొని అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా 15 నుండి 20 ఫీట్ల లోతుకు ఇసుకను తవ్వుతూ పంటపొలాలను చెరువులు మాద్రి చేస్తున్నారు. దీంతో పక్క రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను 24 గంటలు అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. ఈ టిప్పర్లు కూడా కప్పలదొడ్డి గ్రామంలో నుండి వెళ్లడం ద్వారా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జోగి రమేష్ ఎమ్మెల్యే అయినప్పటి నుండి పెడన నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో విపరీతమైన అక్రమ ఇసుక దందా జరుగుతుంది. రోజువారి వేలకొద్దీ టిప్పర్ లతో ఇసుకను నియోజకవర్గని దాటించి వేస్తున్నారు. ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. ఒక సామాన్యుడికి తన ఇంటి నిర్మాణ అవసరాల కోసమో, లేక తన పశువుల పాక భరత్ కోసమో ఒక్క ట్రాక్టర్ మట్టి కావాలనా సవాలక్ష నిబంధనలు చెప్పే రెవెన్యూ అధికారులు, ఇన్ని వేల టిప్పర్ ఇసుకను అక్రమంగా తరలించుకు పోతుంటే కళ్లప్పగించి చోద్యం చూస్తున్నారు. మన నియోజకవర్గం తీర ప్రాంతం. ఇప్పటికే మంచినీటి బావులు కలుషితమై ఉప్పు నీరుగా మారాయి. ఇదే రకంగా అక్రమ మైనింగ్ జరుపుతూ ఇసుకను తరలించినా ఎడల రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం పెను ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా నిద్రావస్థలో ఉన్న రెవెన్యూ వ్యవస్థ మేల్కొని ఇసుక అక్రమ మైనింగ్ను అరికట్టి, ఇసుక బకాసురుల నిజస్వరూపాన్ని బయటపెట్టాలి అని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.