పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి మీరెవరు?

గోపాలపురం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై సామర్లకోట
బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు మరియు వీరమహిళ కవల సీత ఆధ్వర్యంలో శనివారం దేవరపల్లి జనసేన పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ లో సువర్ణరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జనసేన, టీడీపీ అధికారంలోకి రాగానే మీకు తగిన బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉందని, మీ మీటింగుల్లో మీ ప్రభుత్వం యొక్క పనులు ఏంటో ఏం హామీలు ఇచ్చారు. ఏం అమలు చేశారు? ఎంత మంది లబ్ది పొందారు అనే దాని మీద మీరు మాట్లాడండి అంతేకాని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి మీరెవరు. మాట్లాడితే ఆయన మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతావ్ నీ ఇంట్లో నీ తాతల చరిత్ర ఏంటో తెలుసుకొని మాట్లాడమన్నారు, ఆయనతో పలువురు జనసేన వీరమహిళలు, నాయకులు పాల్గొన్నారు, జనసేన వీరమహిళ కవల సీత, కవల గౌతమి, సి హెచ్ ప్రవల్లిక, శాంతి, సాంబబేబీ, అనిశెట్టి గంగరాజు, కంబాల సత్తిబాబు, రామ్ లీలా, శివ, జె కే, కాశీ, నరేంద్ర, ప్రదీప్, కృష్ణ, సాంబశివ, పప్పు రామారావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.