నిరాశ్రయులకు టీటీడీ ఎందుకు చేయూత ఇవ్వలేదు..?

మీడియా సమావేశంలో జనసేన నేతల ప్రశ్న

జవ్వాది తుఫాన్లో తిరుపతి పరిసర ప్రాంతాలలో సామాన్య ప్రజల గూడు మునిగిపోయి కూడు లేక రోడ్డున ప్రజలు పడితే తిరుమల తిరుపతి దేవస్థానం వైసిపి ఆధీనంలో ఉండి జనాన్ని ఆదుకోలేని దుస్థితిలో ఉందని విమర్శించారు ఎంఆర్ పల్లి వైకుంటపురం ఆర్చ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… ప్రభుత్వం నుండి ప్రజలకు ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదు. తాను పర్యటించిన ప్రాంతాల్లో ప్రజలందరూ ఇదే మాట చెబుతున్నారు. తక్షణం వరద ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలకు ప్రభుత్వ సహాయం అందించాలి.
హైదరాబాద్ తరహాలో బాధితులకు ఒక్కో ఇంటికి 10 వేల చొప్పున పరిహారం ప్రకటించాలి. చట్టసభలను కూడా రాజకీయ ఎత్తుగడలకు ఉపయోగించుకున్నది జగన్ మాత్రమే. రివర్స్ టెండరింగ్ తరహాలో రివర్స్ చట్టాలను అమలు చేస్తున్న ఘనత కూడా వైకాపాదే. ఇప్పటికైనా వర్క్ ఫ్రం హోమ్ విధానానికి ముఖ్యమంత్రి స్వస్తి పలకాలి. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పర్యటించి ప్రజలను ఆదుకోవాలి. హరే రామ హరే కృష్ణ సంస్థ ప్రజలకు కష్టంలో సహాయం అందిస్తోంది. ప్రపంచ స్థాయి ధార్మిక సంస్థ టీటీడీ ఇప్పటివరకు ఎందుకు వరదబాధితులకు చేయూత ఇవ్వలేదు.