ఆర్ఆర్ఆర్ బ్యూటీకి ఈరోజు నిశ్చితార్థం జరుగనుందా..?

ఆర్ఆర్ఆర్ చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టబోతున అలియా భట్.. అతి త్వరలో కోరుకున్న వ్యక్తి తో ఏడు అడుగులు వేయబోతుంది. గత కొంతకాలంగా హీరో రణబీర్ తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ బ్యూటీ..ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు డిసైడ్ అయ్యారు. తమ పెళ్లి గురించి స్వయంగా రణబీర్ రీసెంట్ గా చెప్పడం జరిగింది.

నేడు (30 డిసెంబర్) రణబీర్ కపూర్ తో అలియా భట్ నిశ్చితార్థం రణతంబోర్ (జైపూర్)లో జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచారం చేస్తున్నాయి. మంగళవారం ఉదయం.. రణబీర్ కపూర్.. అలియా భట్ ముంబై విమానాశ్రయంలో రణబీర్ తల్లి నీతు సింగ్ తో కలిసి జైపూర్ బయలుదేరారు. ఆ తరువాత రణవీర్ సింగ్ -దీపికా పదుకొనే కూడా పింక్ సిటీకి బయలుదేరడం ఆశ్చర్యపరిచింది. అలాగే మరికొంతమంది సినీ ప్రముఖులు జైపూర్ కు వెళ్లడం తో ఈరోజు రణబీర్ – అలియా ల నిశ్చితార్థం జరగబోతుందని అంత గట్టిగా నమ్ముతున్నారు. మరి నిజంగా నిశ్చితార్థం జరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *