జనసైనికులకు, నాయకులకు, వీరమహిళలకి అండగా ఉంటా: శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే సీటు వచ్చినా రాకపోయినా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఉంటానని, ప్రజల కోసం అనునిత్యం పోరాడుతానని, నా జనసైనికులకు, నాయకులకు, వీరమహిళలకి అండగా ఉంటానని, అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు తర్వాత నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో అధినేత సందేశాన్ని మీకు తెలిపి, తదుపరి కార్యాచరణ తెలియజేస్తానని ఆందోళన చెందద్దు, సంయమనం పాటించండని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా అన్నారు. అనంతరం కోటా చంద్రబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే సీటు వచ్చినందుకు సుధీర్ రెడ్డి పొత్తు ధర్మం పాటించి, తప్పులు జరుగకుండా చూసుకోండి, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టి మా పైన నెపం వెయ్యాలని చూస్తే మీరే నష్ట పోతారని అన్నారు.